News February 16, 2025

ముధోల్: కాంగ్రెస్ పార్టీ మాజీ జిల్లా ఉపాధ్యక్షుడు మృతి

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ ఉపాధ్యక్షుడు నాగేష్ శాస్త్రి HYDలోని ఆసుపత్రిలో అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మాజీ మంత్రి, దివంగత నేత గడ్డేన్నకు శిష్యుడిగా పేరొందారు. ఆదివారం ఉదయం 11గంటలకు స్వగ్రామం ముధోల్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

Similar News

News November 9, 2025

వనపర్తి: ర్యాగింగ్ పై నిఘా.. SP WARNING

image

వనపర్తి జిల్లా కేంద్రం జిల్లా పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ, ప్రవేట్ విద్యాసంస్థల్లో ఎవరైనా ర్యాగింగ్‌కు పాల్పడితే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. ర్యాగింగ్ జరుగుతున్నట్లు తెలిసిన, చూసిన వారు యాంటీ ర్యాగింగ్ కమిటీ, డయల్ 100కు సమాచారం ఇవ్వాలన్నారు. విద్యార్థుల భద్రతకు పోలీసులు, కళాశాల యాజమాన్యం ఎల్లప్పుడూ కట్టుబడి ఉండాలని సూచించారు.

News November 9, 2025

NLG: అమ్మాయిలతో ఇలా రీల్స్ చేస్తున్నారా.. జాగ్రత్త!

image

SMలో పిచ్చి పిచ్చి రీల్స్ చేసేవారిపై HYD పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా యువతితో రొమాన్స్ చేస్తూ నల్గొండకు చెందిన మైనర్ ఆటో నడిపిన ఘటనపై చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పబ్లిక్ ప్లేస్‌లో అసభ్యకరమైన చేష్టలతో రీల్స్ చేసి SMలో అప్‌లోడ్ చేస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. పబ్లిక్‌లో పరువు పోయేలా వికృత రీల్స్ చేసి తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్, కోర్టు మెట్లు ఎక్కించకండి.

News November 9, 2025

ఎయిమ్స్ మంగళగిరిలో ఉద్యోగాలు

image

<>ఎయిమ్స్ <<>>మంగళగిరి 10 నాన్ ఫ్యాకల్టీ, కన్సల్టెంట్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 30 వరకు అప్లై చేసుకోవచ్చు. అనంతరం హార్డ్ కాపీని డిసెంబర్ 10 వరకు పంపాలి. సీనియర్ ప్రోగ్రామర్, అసిస్టెంట్ బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ ఆఫీసర్, బయో మెడికల్ ఆఫీసర్, లా ఆఫీసర్, శానిటరీ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ తదితర పోస్టులు ఉన్నాయి. వెబ్‌సైట్: https://www.aiimsmangalagiri.edu.in