News February 16, 2025

వరంగల్: భర్త దశదిన కర్మ పూర్తవ్వక ముందే భార్య మృతి

image

భర్త దశదిన కర్మ పూర్తవ్వక ముందే భార్య మృతి చెందిన ఘటన వరంగల్ జిల్లా గురజాలలో జరిగింది. మెట్టు మల్లయ్య(78)కు పది రోజుల క్రితం గుండెపోటు వచ్చింది. ఆయన్ను వరంగల్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అదేరోజు ఆయన భార్య సమ్మక్క(69) అస్వస్థతకు గురి కాగా ఆసుపత్రిలో చేర్చారు. ఈ నెల 6వ తేదీన మల్లయ్య మృతి చెందగా, శనివారం సమ్మక్క మృతి చెందింది. దీంతో ఆ కుటుంబంలో, గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Similar News

News November 4, 2025

నలుగురు ఎమ్మెల్యేలను విచారించనున్న స్పీకర్

image

TG: ఈ నెల 6 నుంచి ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ రెండో విడత విచారణ చేపట్టనున్నారు. 6, 12న తెల్లం వెంకట్రావ్, సంజయ్‌, 7, 13న పోచారం శ్రీనివాస్ రెడ్డి, అరికెపూడి గాంధీలను రెండు సార్లు విచారించనున్నారు. తొలుత పిటిషనర్లు, తర్వాత ప్రతివాదులను ఆయన క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. అంతకుముందు తొలి విడతలో <<17912398>>ఇద్దరు<<>> ఎమ్మెల్యేలను విచారించిన సంగతి తెలిసిందే.

News November 4, 2025

పల్నాడు సోదర కవులు గురించి మీకు తెలుసా..!

image

పల్నాడు సోదర కవులుగా పేరు గాంచిన కన్నెగంటి ప్రభులింగా చార్యులు, చిన్న లింగాచార్యులు దాచేపల్లి మండలం తక్కెళ్ళపాడులో జన్మించారు. దేశవ్యాప్తంగా ​అనేక అష్టావధానాలు, శతావధానాలు చేసి అప్పట్లోనే కాశీ పండితుల ప్రశంసలు పొందారు. 1942-44 ప్రాంతంలో “విద్వగ్ద్వాల” ఆస్థానంలో కవిసింహ కాశీపత్యవధాని వెంట వెళ్లి పండితుల మెప్పు పొందారు. వీరు రచించిన పల్నాటి వీర చరిత్ర నాటకం ప్రసిద్ధి చెందింది.

News November 4, 2025

నిజామాబాద్: ఈవీఎం గోడౌన్‌ను సందర్శించిన కలెక్టర్

image

నిజామాబాద్‌లోని వినాయకనగర్‌లో ఉన్న ఈవీఎం గోడౌన్‌ను కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి మంగళవారం సందర్శించారు. సాధారణ పరిశీలన ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయి సందర్శన జరిపారు. ఈవీఎం గోడౌన్‌కు వేసిన సీళ్లను పరిశీలించారు. అక్కడ పోలీసు బందోబస్తు తీరును గమనించి పలు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట నిజామాబాద్ ఫైర్ ఆఫీసర్ శంకర్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు ధన్వాల్, సిబ్బంది సాత్విక్, విజయేందర్ పాల్గొన్నారు.