News February 16, 2025
వరంగల్: భర్త దశదిన కర్మ పూర్తవ్వక ముందే భార్య మృతి

భర్త దశదిన కర్మ పూర్తవ్వక ముందే భార్య మృతి చెందిన ఘటన వరంగల్ జిల్లా గురజాలలో జరిగింది. మెట్టు మల్లయ్య(78)కు పది రోజుల క్రితం గుండెపోటు వచ్చింది. ఆయన్ను వరంగల్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అదేరోజు ఆయన భార్య సమ్మక్క(69) అస్వస్థతకు గురి కాగా ఆసుపత్రిలో చేర్చారు. ఈ నెల 6వ తేదీన మల్లయ్య మృతి చెందగా, శనివారం సమ్మక్క మృతి చెందింది. దీంతో ఆ కుటుంబంలో, గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Similar News
News November 23, 2025
28న 25 బ్యాంకులకు శంకుస్థాపన

AP: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెల 28న రాజధాని అమరావతిలో పర్యటించనున్నారు. అక్కడ ఒకేసారి 25 బ్యాంకు భవన నిర్మాణ పనులకు భూమిపూజ చేయనున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు అక్కడ ఏర్పాటు కానున్నాయి. ఇప్పటికే CRDA బ్యాంకులకు అవసరమైన భూములను కేటాయించింది. బ్యాంకుల ఏర్పాటుతో రాజధానిలో ఆర్థిక కార్యకలాపాలు వేగవంతం కానున్నాయి.
News November 23, 2025
మిద్దె తోటల్లో ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిది

మిద్దె తోటల పెంపకంలో సేంద్రియ ఎరువులైన పేడ, వేప పిండి వాడితే మట్టిసారం పెరిగి కూరగాయలు ఎక్కువగా పండుతాయి. ఎత్తుగా పెరిగే, కాండం అంత బలంగా లేని మొక్కలకు కర్రతో ఊతమివ్వాలి. తీగజాతి మొక్కల కోసం చిన్న పందిరిలా ఏర్పాటు చేసుకోవాలి. మట్టిలో తేమను బట్టి నీరివ్వాలి. * మొక్కలకు కనీసం 4 గంటలైనా ఎండ పడాలి. చీడపీడల నివారణకు లీటరు నీటిలో 5ml వేప నూనె వేసి బాగా కలిపి ఆకుల అడుగు భాగంలో స్ప్రే చేయాలి.
News November 23, 2025
కనిగిరిపై కనికరించండి.. మహాప్రభో.!

కనిగిరిని కొత్తగా ఏర్పడే మార్కాపురం జిల్లాలో కలపవద్దని ప్రజలు అంటున్నారు. ఇప్పుడిప్పుడే అభివృద్ధి పథంలో నడుస్తున్న కనిగిరిని మళ్లీ కొత్త జిల్లాలో కలిపే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సూచిస్తున్నారు. రెవెన్యూ డివిజన్ కావాలన్న కల నెరవేరిన మూడేళ్లలోనే మళ్లీ మార్పులు వద్దన్న వాదన వినిపిస్తోంది. ప్రకాశం జిల్లాలోనే కనిగిరి ఉండాలా? కొత్తగా ఏర్పడే మార్కాపురం జిల్లాలోకి మారాలా? మీరేమనుకుంటున్నారో కామెంట్.


