News February 16, 2025
త్వరలోనే నాగర్‌కర్నూల్‌కు రైల్వే లైన్: కేంద్రమంత్రి

నాగర్‌కర్నూల్ పార్లమెంట్ బీజేపీ నాయకుడు భరత్ ప్రసాద్ ఇవాళ ఢిల్లీలో కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం నాగర్‌కర్నూల్ పార్లమెంట్‌కు సంబంధించిన పలు అంశాల గురించి కేంద్రమంత్రికి వివరించినట్లు భరత్ ప్రసాద్ తెలిపారు. త్వరలోనే నాగర్‌కర్నూల్ పార్లమెంట్‌కు రైల్వే లైన్ వస్తుందన్నారు.
Similar News
News April 19, 2026
మచిలీపట్నంలో నేటి నాన్ వెజ్ ధరలివే!

మచిలీపట్నంలో ఆదివారం నాన్ వెజ్ ధరలు కేజీలలో ఇలా ఉన్నాయి. చికెన్ స్కిన్‌లెస్ కేజీ రూ. 260, స్కిన్ రూ. 250గా ఉంది. మటన్ ధర పట్టణంలో కేజీ రూ. 1000, గ్రామీణ ప్రాంతాల్లో కేజీ రూ. 800 వద్ద కొనసాగుతోంది. రొయ్యలు కేజీ రూ. 300, పీతలు కేజీ రూ. 300 చొప్పున విక్రయిస్తున్నారు. చేపల్లో కట్లా రకం కేజీ రూ. 200 ఉండగా, రాగండి కేజీ రూ. 170 పలుకుతోంది. మరి మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
News April 19, 2026
VZM: చందానోత్సవానికి వచ్చే వారికి ముఖ్య గమనిక

ఏప్రిల్ 20న సింహచలం చందనోత్సవానికి వస్తున్న భక్తుల వాహనాలను కొండపైకి అనుమతించడంలేదు. దేవస్థానం సుమారు 100 బస్సులు ఏర్పాటు చేసి భక్తులను కొండపైకి తీసుకెళ్లనుంది. అయితే అనకాపల్లి, గోపాలపట్నం, పెందుర్తి, కొత్తవలస నుంచి వచ్చే వారు పాతగోశాల, శ్రీనివాస కళ్యాణ మండపం, సింహపురి కాలనీ వద్ద బస్సులు ఎక్కాలి. హనుమంతువాక నుంచి వచ్చే భక్తులు కొత్త గోశాల, అడవివరం కొత్త టోల్ గేట్ బస్ స్టాప్ వద్ద బస్సులు ఎక్కాలి.
News April 19, 2026
HYD: పచ్చని కాపురంలో ‘అక్రమ’ చిచ్చులు!

పచ్చని కాపురాల్లో కలహాలు చిచ్చురేపోతున్నాయి. HYD, CYB, MKG పరిధిలో ఈ ఏడాది నమోదైన కేసులను పరిశీలిస్తే లోతైన విషయాలు బయటపడ్డట్లుగా పోలీసులు గుర్తించారు. మద్యంమత్తులో గొడవలు, మనస్పర్దలు , ఒకరినొకరు పట్టించుకోకపోవడంతో అక్రమ సంబంధాలు, అనుమానాలు ఇలా కారణమేదైనా బంధాలు బలి అయ్యాయి. ఈ ఘటనలు స్థానికంగా కలకలం రేపాయి. పలు కేసులలో పోలీసులు కౌన్సెలింగ్ సైతం అందించాల్సిన పరిస్థితి ఏర్పడింది.


