News February 16, 2025

NRPT: ఆర్డర్ కాపీలు అందుకున్న (2008) DSC అభ్యర్థులు

image

DSC 2008లో నష్టపోయిన అభ్యర్థులు ఎట్టకేలకు శనివారం రాత్రి అపాయింట్‌మెంట్ ఆర్డర్ కాపీలను అందుకున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ZPCEO సౌభాగ్య లక్ష్మి, DEO గోవిందరాజులు సమక్షంలో ముందుగా అభ్యర్థుల సర్టిఫికెట్లు పరిశీలించారు. నారాయణపేట కలెక్టరేట్‌లో కలెక్టలో డీఈఓ గోవిందరాజు చేతుల మీదుగా ఉపాధ్యాయుల సంఘాలతో కలిసి 45 మంది 2008 DSC అభ్యర్థులు ఆర్డర్ కాపీలను అందుకున్నారు. 

Similar News

News July 6, 2025

WGL: అందరి చూపు గాంధీ భవన్ వైపే..!

image

HYD గాంధీ భవన్‌లో పీసీసీ క్రమశిక్షణ కమిటీ సోమవారం కీలక సమావేశం కానుంది. WGL కాంగ్రెస్‌ MLAలు, మంత్రి సురేఖ మధ్య విభేదాలతో వచ్చిన ఫిర్యాదులపై కమిటీ తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కొండా మురళి వ్యాఖ్యలపై MLAలు ఇప్పటికే పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జ్‌ మీనాక్షి దృష్టికి తీసుకెళ్లగా.. మురళి, సురేఖ సైతం ఆమెను కలిసి తమ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. కాగా రేపటి సమావేశం వరంగల్‌లో ఉత్కంఠ రేపుతోంది.

News July 6, 2025

IIITలో 598 సీట్లు మిగిలాయి..!

image

IIIT సీట్ల భర్తీకి నిర్వహిస్తున్న కౌన్సెలింగ్ శనివారంతో ముగిసింది. నాలుగు క్యాంపస్‌ల్లో 598 సీట్లు మిగిలాయి. ఒక్కో IIITలో 1,010 సీట్లు ఉండగా.. ఇడుపులపాయలో 132 మిగలడం గమనార్హం. ఈ సీట్లను భర్తీ చేసేందుకు ఈనెల 14 నుంచి రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. సీట్లు పొందిన వారికి ఈనెల 14 నుంచి తరగతుల ప్రారంభమవుతాయని రిజిస్ట్రార్ వెల్లడించారు.

News July 6, 2025

ఆమదాలవలస: పార్ట్ టైం పేరుతో వెట్టి చాకిరి తగదు

image

పార్ట్ టైం పేరుతో వీఆర్ఏలతో ప్రభుత్వం వెట్టి చాకిరి చేయించుకుంటుందని రాష్ట్ర వీఆర్ఏ సంఘం అధ్యక్షుడు షేక్ బందిగీకి సాహెబ్ అన్నార. వీఆర్ఏ సంఘం 7వ జిల్లా మహాసభ ఆదివారం ఆమదాలవలసలో జరిగింది. వీఆర్ఏలు ఫుల్ టైం విధులు నిర్వహిస్తున్నా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం లేదని, కనీస వేతనాలు అమలు చేయడం లేదన్నారు. తెలంగాణ మాదిరిగా రాష్ట్రంలో వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయాలని కోరారు.