News February 16, 2025

కరీంనగర్: టీచర్లు పట్టం కట్టేది ఎవరికో.!

image

KNR, NZB, ADB, MDK టీచర్ MLC స్థానానికి ఈనెల 27న ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత ఎమ్మెల్సీ కూర రఘోతంరెడ్డి, BJP నుంచి కొమురయ్య, TPTF నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి Y.అశోక్ కుమార్, PRTU ఉపాధ్యాయ సంఘం నుంచి వంగ మహేందర్ రెడ్డి, రిటైర్డ్ RJD L.సుహాసినితో పాటు మొత్తం 17 మంది టీచర్ ఎమ్మెల్సీ బరిలో నిలిచారు. మేధావి వర్గంగా బావించే టీచర్లు ఎవరికి పట్టం కట్టనున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.

Similar News

News September 18, 2025

KNR: ఏళ్ల తర్వాత RTCలో JOBS.. DON’T MISS ఛాన్స్!

image

కరీంనగర్ RTC రీజియన్ పరిధిలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 64 పోస్టుల భర్తీకి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కరీంనగర్‌లో 19, పెద్దపల్లిలో 16, జగిత్యాలలో 18, సిరిసిల్లలో 11 చొప్పున ఖాళీలను నింపనున్నారు. అక్టోబర్ 8 నుంచి 28 వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తుకు కావాల్సిన అర్హతలు, జీతభత్యాల కోసం <<17746081>>ఇక్కడ CLICK<<>> చేయండి. #SHARE IT.

News September 18, 2025

చిత్తూరు: రెండేళ్ల క్రితం హత్య.. ఇప్పుడు వెలుగులోకి

image

బంగారుపాళ్యం(M) బలిజపల్లికి చెందిన చెంచులక్ష్మి భర్త చనిపోగా శేషాపురానికి చెందిన దేవేంద్రతో వివాహేతర బంధం ఏర్పడింది. పెనుమూరు(M) సామిరెడ్డిపల్లిలోని ఓ మామిడి తోటలో కాపలా పనికి 2023లో ఇద్దరు వచ్చారు. అప్పట్లోనే వాళ్ల మధ్య గొడవ జరగ్గా చెంచులక్ష్మిని దేవేంద్ర నీటిలో ముంచి చంపేశాడు. తోటలోనే డెడ్‌బాడీని పాతిపెట్టి ఆమె ఎటో వెళ్లిపోయిందని మృతురాలి తల్లిని నమ్మించాడు. పోలీసులు నిన్న అతడిని అరెస్ట్ చేశారు.

News September 18, 2025

ఎటపాక: స్కూ డ్రైవర్ బిట్‌ను మింగేసిన బాలుడు

image

ఎటపాకలోని చోడవరానికి చెందిన గౌతమ్ (8) బుధవారం ఆడుకుంటూ స్క్రూ డ్రైవర్‌ను మింగేశాడు. తీవ్రమైన కడుపునొప్పితో అల్లాడుతుండగా కుటుంబీకులు ఆసుపత్రికి తరలించారు. అది పేగులో అడ్డం తిరగడంతో భద్రాచలం ఆసుపత్రి వైద్యులు ఆపరేషన్ చేసి బిట్‌ను బయటకు తీశారు. దీంతో బాలుడు సురక్షితంగా ప్రాణాలతో బయట పడ్డాడు.