News February 16, 2025
హైదరాబాద్-విజయవాడ హైవేపై ప్రయాణిస్తున్నారా?

TG: సూర్యాపేట జిల్లాలోని శ్రీలింగమంతుల స్వామి(పెద్దగట్టు) జాతర సందర్భంగా హైదరాబాద్-విజయవాడ నేషనల్ హైవేపై ట్రాఫిక్ మళ్లిస్తున్నారు. HYD నుంచి విజయవాడ వెళ్లేవారు నార్కెట్‌పల్లి, నల్గొండ, కోదాడ మీదుగా వెళ్లాలి. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలను కోదాడ, నల్గొండ, నార్కెట్‌పల్లి మీదుగా మళ్లిస్తున్నారు. ఇవాళ, రేపు ఈ ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని పోలీసులు తెలిపారు.
Similar News
News February 13, 2026
NZB: రాష్ట్రస్థాయి విలువిద్య పోటీలకు ఎంపికైన క్రీడాకారులు

రాష్ట్రస్థాయి సీఎం కప్ విలువిద్య పోటీలకు గురువారం నిజామాబాద్‌లో ఖేలో ఇండియా విలువిద్య శిక్షణ కేంద్రం రాజారాం స్టేడియంలో జిల్లా స్థాయి ఎంపికలు నిర్వహించారు. ఎంపికైన క్రీడాకారులు ఖమ్మంలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి సీఎం కప్ పోటీల్లో పాల్గొంటారు. కాంపౌండ్, రికవ్ ఇండియన్ రౌండ్ విభాగాల్లో ఎంపికలు జరిగాయి. ఈ కార్యక్రమంలో విలువిద్య శిక్షకులు మురళి, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

శుభ సమయం (13-2-2026) శుక్రవారం

➤ తిథి: బహుళ ఏకాదశి మ.1.36 వరకు
➤ నక్షత్రం: మూల మ.3.45 వరకు
➤ శుభ సమయాలు: ఉ.6.29-8.45 వరకు, ఉ.10.17-11.14 వరకు, మ.1.21-1.58 వరకు, మ.3.45-సా.4.00 వరకు, సా.4.57-5.54 వరకు ➤ రాహుకాలం: ఉ.10.30-12.00 వరకు
➤ యమగండం: మ.3.00-సా.4.30 వరకు
➤ దుర్ముహూర్తం: ఉ.8.46-9.32 వరకు, మ.12.34-1.20 వరకు ➤ వర్జ్యం: రా.1.59-3.45, తె.2.12-3.57 వరకు
➤ అమృత ఘడియలు: లేవు