News March 20, 2024
జెలెన్‌స్కీకి ప్రధాని మోదీ ఫోన్ కాల్
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో ప్రధాని మోదీ చర్చలు జరిపారు. ఫోన్ కాల్ ద్వారా వీరు ఇరు దేశాల బంధం బలోపేతంపై చర్చించినట్లు తెలుస్తోంది. రష్యాతో యుద్ధం విషయం ప్రస్తావనకు రాగా చర్చలతోనే సమస్యను పరిష్కరించుకోవాలని జెలెన్‌స్కీకి మోదీ సూచించారు. ఇరు పక్షాల మధ్య జరిగే శాంతి నెలకొల్పేందుకు భారత్ తన వంతు కృషి చేస్తుందన్నారు. కాగా భారత్ అందిస్తున్న సాయానికి జెలెన్‌స్కీ మోదీకి ధన్యవాదాలు తెలిపారు.
Similar News
News November 25, 2024
అదే జరిగితే నేడు రూ.10లక్షల కోట్ల లాభం!
మహారాష్ట్రలో మహాయుతి విజయంతో నిఫ్టీ 400, సెన్సెక్స్ 2000 పాయింట్లు పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇదే జరిగితే నేడు ఇన్వెస్టర్లు రూ.10L కోట్లమేర లాభం పొందుతారు. కేంద్ర పాలసీలకు అనుగుణంగా ఉండే కంపెనీల షేర్లలో వారు పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. ఇక మహారాష్ట్రలో BJP అనుకూల ప్రమోటర్లున్న కంపెనీలపై ఆసక్తి పెరిగింది. APలో NDA గెలిచినప్పుడు హెరిటేజ్ ఫుడ్స్ షేర్లు వరుసగా అప్పర్ సర్క్యూట్ తాకడం తెలిసిందే.
News November 25, 2024
పోటీపడి జలవిద్యుదుత్పత్తి.. అడుగంటుతున్న శ్రీశైలం జలాలు
శ్రీశైలం జలాశయం నుంచి AP, TG పోటీ పడి జలవిద్యుదుత్పత్తి చేస్తున్నాయి. రోజూ 40వేల క్యూసెక్కులు వాడుకుంటుండటంతో నీటినిల్వలు వేగంగా పడిపోతున్నాయి. గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 215TMCలు కాగా ప్రస్తుతం 149TMCలే మిగిలిఉన్నాయి. వచ్చే వర్షాకాలం వరకు సాగు, తాగు అవసరాల కోసం నీటిని సంరక్షించాలని కృష్ణా బోర్డు లేఖ రాసినా AP, TG పట్టించుకోవట్లేదు. ఇలాగే కొనసాగితే నీటి కటకట తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
News November 25, 2024
నేడు RGVని విచారించనున్న ప్రకాశం పోలీసులు
డైరెక్టర్ RGVని ఇవాళ ప్రకాశం జిల్లా పోలీసులు విచారించనున్నారు. వ్యూహం సినిమా ప్రమోషన్లలో భాగంగా చంద్రబాబు, పవన్‌ను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని మద్దిపాడు పోలీస్ స్టేషన్లో ఆయనపై కేసు నమోదైంది. వారం కిందటే విచారణకు రావాలని పోలీసులు నోటీసులివ్వగా, తనకు సమయం కావాలని వాట్సాప్‌లో ఆర్జీవీ మెసేజ్ పంపారు. ఆ గడువు అయిపోగా, నేడు ఆయన్ను విచారించడానికి ఒంగోలు PSలో ఏర్పాట్లు చేశారు.