News February 16, 2025
తెలుగు సినీ చరిత్రలో కృష్ణవేణిది ప్రత్యేక అధ్యాయం: CM

అలనాటి నటి, నిర్మాత కృష్ణవేణి <<15477241>>మరణం<<>> బాధాకరమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. కృష్ణవేణి బహుముఖ ప్రజ్ఞాశాలి అని, నటిగా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా తెలుగు సినీ చరిత్రలో ఆమెది ప్రత్యేక అధ్యాయమని కొనియాడారు. నందమూరి తారక రామారావు నట జీవితానికి తొలుత అవకాశం ఇచ్చింది కృష్ణవేణే అని గుర్తు చేసుకున్నారు. ఇటీవల NTR సెంటినరీ, వజ్రోత్సవ వేడుకల్లో ఆమెను సత్కరించానని తెలిపారు.
Similar News
News November 11, 2025
ప్రకృతి వైపరీత్యాలు సంభవించకూడదంటే?

త్రివిధ తాపాల్లో దైవిక తాపం ఒకటి. ఇది ప్రకృతి శక్తుల వలన సంభవిస్తుంది. అధిక వర్షాలు, కరవు, భూకంపాలు, పిడుగులు, తుఫానులు, గ్రహాచారాల వలన కలిగే బాధలు దీని కిందకి వస్తాయి. ఈ దుఃఖాల నుంచి ఉపశమనం పొందడానికి దైవారాధన, భక్తి, ప్రకృతి పట్ల మనం గౌరవం చూపాలి. యజ్ఞాలు, దానాలు, పవిత్ర నదీ స్నానాలు వంటి ధార్మిక కర్మలను ఆచరించాలి. విధిని అంగీకరించాలి. తద్వారా ఈ దైవిక దుఃఖాలను తట్టుకునే మానసిక శక్తి లభిస్తుంది.
News November 11, 2025
ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో 9 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. మోటార్ ట్రాన్స్‌పోర్ట్ డ్రైవర్, MTS, లాస్కర్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్ ఉత్తీర్ణతతో పాటు పనిఅనుభవం ఉండాలి. అభ్యర్థులను డాక్యుమెంట్ వెరిఫికేషన్, రాతపరీక్ష, స్కిల్/ట్రేడ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://indiancoastguard.gov.in/
News November 11, 2025
పత్తి కాండం, ఆకు, కాయపై నల్ల మచ్చల నివారణ ఎలా?

వాతావరణ పరిస్థితులు, ఇతర కారణాల వల్ల పత్తి మొక్క కాండంపైన, ఆకు, కాయలపై నల్లని మచ్చలు కనిపిస్తాయి. అలాగే కాయ కుళ్లిపోవడం లేదా ఎదగకపోవడం జరుగుతుంటుంది. ఈ సమస్యను గుర్తిస్తే లీటరు నీటికి 2.5గ్రా కార్బండజిమ్+ మాంకోజెబ్ లేదా కాపర్ ఆక్సీక్లోరైడ్ 3గ్రా. లేదా ప్రొపికొనజోల్ 1మి.లీ. లేదా క్రెసోక్సిమ్ మిథైల్ 1ml లాంటి మందులను మారుస్తూ 1 లేదా 2 సార్లు 10 నుంచి 15 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి.


