News February 16, 2025

తొక్కిసలాట ఘటనపై విచారం వ్యక్తం చేసిన అనకాపల్లి ఎంపీ

image

ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట ఘటనపై అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ఆదివారం తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. తొక్కిసలాటలో ప్రాణ నష్టం జరగడం అత్యంత బాధాకరంగా పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు రైల్వే శాఖ రూ.పది లక్షల చొప్పున నష్ట పరిహారం ప్రకటించిందని అన్నారు. ఘటనపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు.

Similar News

News November 1, 2025

పుష్ప, KGF కూడా అలా రిలీజ్ చేస్తారా?

image

‘బాహుబలి’ యూనివర్స్‌లో వచ్చిన 2 భాగాలను కలిపి ‘బాహుబలి-ది ఎపిక్’గా విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇలా 2 పార్టులుగా వచ్చి హిట్ అయిన సినిమాలపై చర్చ జరుగుతోంది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప, పుష్ప-2, ప్రశాంత్ నీల్-యశ్ కాంబోలో వచ్చిన KGF, KGF-2ను కూడా ట్రిమ్ చేసి ఇలా ఒకే సినిమాగా రిలీజ్ చేస్తే బాగుంటుందని పలువురు ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఈ కొత్త ట్రెండ్‌పై మీరేమంటారు?

News November 1, 2025

తిరుపతి: ఎకరాకు 3 బస్తాల యూరియా

image

తిరుపతి జిల్లాలోని రైతులకు ఎరువుల సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ జిల్లా వ్యవసాయ అధికారిని ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా వ్యవసాయ అధికారి ప్రసాద్ రావు, అధికారులతో సమీక్షించారు. యూరియా కార్డుల ద్వారా ప్రతి రైతుకు ఎకరాకు 3బస్తాలు అందజేసేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రైతులు ఎటువంటి ఆందోళన చెందవద్దన్నారు.

News November 1, 2025

సంగారెడ్డి: కరాటే శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం

image

జిల్లాలోని 37 పీఎంశ్రీ పాఠశాలలో కరాటే శిక్షణ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. కుంగ్ ఫు, జోడో, కలర్ కలరిపయట్టు నేర్పించే ఏజెన్సీలు ఈనెల 3వ తేదీ వరకు కలెక్టరేట్‌లోని రెండో అంతస్తులో ఉన్న సమగ్ర శిక్ష కార్యాలయంలో దరఖాస్తు చేయాలని చెప్పారు. ఎంపికైన వారు విద్యార్థులకు కరాటే నేర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.