News February 16, 2025
MPTC, ZPTC ఎన్నికలు: హనుమకొండ జిల్లా UPDATES

హనుమకొండ జిల్లా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు-2025కు సంబంధించిన పోలింగ్ కేంద్రాల జాబితాను అధికారులు విడుదల చేశారు. జిల్లాలో 12 ZPTC స్థానాలు ఉన్నాయి. 631 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. మొత్తం 129 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. హన్మకొండ జిల్లాలో మొత్తం 3,72,646 మంది ఓటర్లు ఉన్నారు.
Similar News
News January 20, 2026
తొలి EV ‘అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా’ ఆవిష్కరించిన టయోటా

భారత్లో టయోటా తన మొదటి EV ‘అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా’ కారును ఆవిష్కరించింది. LED డీఆర్ఎల్స్, ఆకర్షణీయమైన హెడ్ లాంప్స్, డిఫరెంట్ ఫ్రంట్ బంపర్ అమర్చారు. ఇంటీరియర్లో సన్రూఫ్, వైర్లెస్ ఛార్జర్, పవర్డ్ డ్రైవర్ సీట్, 360 డిగ్రీ కెమెరా వంటి ఫీచర్స్ ఉన్నాయి. 61kWh బ్యాటరీ వేరియంట్ 543KM, 49kWh వేరియంట్ 440KM మైలేజీ ఇస్తుందని కంపెనీ వెల్లడించింది. ఈ కారు ధరను ఇప్పటి వరకు ప్రకటించలేదు.
News January 20, 2026
ఏప్రిల్ 20న సింహాచలం చందనోత్సవం

సింహాచలంలో ఈఏడాది ఏప్రిల్ 20న లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవం జరగనుంది. సంబంధిత ఏర్పాట్లపై జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి మంగళవారం విశాఖ కలెక్టరేట్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. గత అనుభవాల దృష్ట్యా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు. కలెక్టర్ హరేంధిర ప్రసాద్, జేసీ, సీపీ, జీవీఎంసీ కమిషనర్, దేవస్థానం ఈవో ఉన్నారు.
News January 20, 2026
WNP: రేపు దివ్యాంగుల ప్రత్యేక ప్రజావాణి

మహిళా, శిశు, వికలాంగుల, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశాల మేరకు దివ్యాంగుల కోసం బుధవారం ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సంక్షేమ శాఖ అధికారి కే.సుధారాణి ఒక ప్రకటనలో తెలిపారు. కాబట్టి ప్రతి ఒక్క దివ్యాంగులు వారి వారి సమస్యలు ఏమైనా ఉన్నా కలెక్టర్ దృష్టికి తీసుకురావాలని కోరారు.


