News February 16, 2025
CRASH ప్రోగ్రాంలో తాగునీటి బోర్లకు రిపేర్స్: RWS EE

అల్లూరి జిల్లాలోని 22 మండలాల్లోని మంచినీటి బోర్లకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయిస్తున్నట్లు గ్రామీణ నీటి సరఫరా శాఖ ఈఈ జవహర్ కుమార్ తెలిపారు. జిల్లాలో మొత్తం 9,639 చేతి పంపులు ఉన్నాయన్నారు. వీటికి 45 రోజుల క్రాష్ ప్రోగ్రాంలో march 15వ తేదికి రిపేర్లు పూర్తి చేసి, గ్రామీణ ప్రాంతంలో పరిశుభ్రమైన నీటిని అందించాలన్నదే తమ లక్ష్యమని వెల్లడించారు.
Similar News
News April 18, 2026
బయ్యారంలో గ్రీన్ స్టీల్ ప్లాంట్ నెలకొల్పాలని CM వినతి

MHBD బయ్యారంలో గ్రీన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని CM రేవంత్ రెడ్డి కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామికి విజ్ఞప్తి చేశారు. శనివారం ఢిల్లీలో కేంద్ర మంత్రులతో సమావేశమైన సీఎం, పర్యావరణ హితంగా ఉక్కు ఉత్పత్తి చేసే పరిశ్రమల ఆవశ్యకతను వివరించారు. ‘తెలంగాణ రైజింగ్-2047’ విజన్‌లో భాగంగా హైదరాబాద్‌ను గ్రీన్ స్టీల్ క్లస్టర్, ఈవీ బ్యాటరీల తయారీ కేంద్రంగా తీర్చిదిద్దాలని కోరారు.
News April 18, 2026
స్వచ్ఛతను కాపాడుకోవడం ప్రతీ ఒక్కరి బాధ్యత: కలెక్టర్

స్వచ్ఛతను కాపాడుకోవడం ప్రతీ ఒక్కరి బాధ్యత అని ప్రజలు, స్థానిక ప్రజాప్రతినిధులు కలెక్టర్ రాజకుమారి సూచించారు. శనివారం నంద్యాలలోని పొన్నాపురం కాలనీలో నిర్వహించిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. కాలనీలో పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణకు ప్రజల భాగస్వామ్యం ముఖ్యమని అన్నారు. కాలనీలో పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించారు.
News April 18, 2026
మదనపల్లెలో నేటి టమాటా ధరల వివరాలు.!

మదనపల్లె టమాటా మార్కెట్లో కిలో టమాటాలు రూ.24కి కొనుగోలు చేశారు. మదనపల్లె నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి శనివారం 165 మెట్రిక్ టన్నుల టమాటాలను రైతులు తీసుకు వచ్చారు. స్థానిక వ్యాపారులు 10 కిలోల మొదటి రకం టమాటాల బాక్స్ రూ.240 చెల్లించి రైతుల నుంచి కొనుగోలు చేశారు. అలాగే రెండవ రకం టమాటాలు రూ.190 అమ్ముడు పోగా.. మూడవ రకం టమాటాలు రూ.180 పలకడంతో రేట్లు పెరిగాయని రైతులు హర్షం వ్యక్తం చేశారు.


