News March 20, 2024

మదనపల్లె: పిల్లలు పుట్టలేదని విషం తాగిన దంపతులు 

image

బి కొత్తకోటలో విషం తాగి దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. పోలీసుల కథనం.. స్థానిక రంగసముద్రం రోడ్డులో ఉంటున్న దంపతులు బాలాజీ, అశ్వినికి 9 ఏళ్లగా పిల్లలు కలగలేదు. దీంతో వారు బుధవారం గొడవపడ్డారు. మనస్థాపం చెందిన అశ్విని పురుగుమందు తాగడంతో గమనించిన భర్త ఆవెంటనే పురుగు మందుతాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. బాధితులను కుటుంబీకులు చికిత్సకోసం వెంటనే మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు.

Similar News

News September 26, 2025

చిత్తూరు జిల్లాలో వర్కర్లకు వేతనాలు పెంపు

image

జిల్లాలో ప్రభుత్వ రంగ సంస్థల్లో విధులు నిర్వహిస్తున్న NMR, మజ్దూర్ వర్కర్లకు 2025-26 ఆర్థిక సంవత్సరానికి కనీస వేతనాలు పెంచుతున్నట్టు చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. సెప్టెంబర్ 16న నిర్వహించిన కనీస వేతనాల పెంపునకు సంబంధించి కమిటీ సభ్యుల సిఫారసు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ధరల పెరుగుదల వ్యత్యాసాన్ని అనుసరించి వేతనాలను పెంచినట్లు ఆయన స్పష్టం చేశారు.

News September 26, 2025

చిత్తూరులో రేపు 2K రన్

image

ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. చిత్తూరు గాంధీ విగ్రహం నుంచి మెసానికల్ గ్రౌండ్ వరకు 2K రన్ ఉదయం 7 గంటలకు ప్రారంభం అవుతుందన్నారు. వ్యాసరచన, వకృత్వపు పోటీలు నిర్వహిస్తామని వెల్లడించారు. కార్యక్రమాల నిర్వహణపై అధికారులకు బాధ్యతలు కేటాయించామన్నారు.

News September 26, 2025

రాజంపేట MP మిథున్ రెడ్డికి బెయిల్ వచ్చేనా?

image

రాజంపేట MP మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. ఈనెల 29న తీర్పు వెల్లడిస్తామని ACB కోర్టు పేర్కొంది. ‘లిక్కర్ స్కాంలో మిథున్ రెడ్డి కింగ్ పిన్. ఆయన కంపెనీల్లో రూ.5కోట్ల ట్రాన్సాక్షన్లపై అనుమానం ఉంది. బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారు’ అని AG దమ్మాలపాటి శ్రీనివాసులు వాదించారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగా MPపై కేసు పెట్టారని ఆయన తరఫు లాయర్ నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు.