News March 20, 2024
పోలింగ్ రోజు ఆ రాష్ట్రంలో సెలవు

లోక్‌సభ ఎన్నికలు జరిగే రోజు సెలవు ఇస్తూ రాజస్థాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్రంలో 2 విడతల్లో పోలింగ్ జరగనుంది. APR 19, 26న పోలింగ్ ఉండటంతో ఆ 2 రోజులు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు పెయిడ్ హాలిడేగా ప్రకటించింది. ఇది రాష్ట్రంలో ఓటింగ్ శాతాన్ని పెంచుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ప్రైవేటు కంపెనీలు తప్పనిసరిగా వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలంది. మరి ఇక్కడా సెలవు ఇవ్వాలంటారా? కామెంట్ చేయండి.
Similar News
News March 5, 2026
ఫైనల్‌కు ఒక్క అడుగుదూరంలో..

T20WC: నేడు ముంబై వేదికగా భారత్ ఇంగ్లండ్‌తో సెమీస్‌లో తలపడనుంది. టీ20 ప్రపంచకప్ సెమీస్‌లో వరుసగా మూడోసారి ఇంగ్లండ్‌తో ఆడనుంది. 2022లో ఇంగ్లండ్, 2024లో భారత్ సెమీస్ విజేతలుగా నిలిచాయి. ఇక హెడ్ టు హెడ్‌లో భారత్‌దే పైచేయి. T20WC చరిత్రలో ఐదుసార్లు తలపడగా IND మూడుసార్లు గెలిచింది. 2024 మ్యాజిక్‌ను రిపీట్ చేసి మళ్లీ ఫైనల్ చేరాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రాత్రి.7.00కు మ్యాచ్ ప్రారంభం అవుతుంది.
News March 5, 2026
నేడు షా సమక్షంలో నితీశ్ నామినేషన్?

బిహార్ సీఎం నితీశ్ కుమార్ నేడు కేంద్రహోంమంత్రి అమిత్ షా సమక్షంలో రాజ్యసభ నామినేషన్ వేసే అవకాశం ఉందని జాతీయ మీడియా పేర్కొంటోంది. ఈరోజు NDA శ్రేణులతో భేటీకి షా బిహార్ రానున్నారు. ఈ సందర్భంగా BJP చీఫ్ నితిన్ నబీన్‌తో పాటు నితీశ్ కూడా షా సమక్షంలో నామినేషన్ వేస్తారని ప్రచారం సాగుతోంది. అయితే జేడీయూలో ఓ వర్గం ఇందుకు సుముఖంగా లేదు. ఈ నేపథ్యంలో బిహార్ రాజకీయాల్లో నెక్ట్స్ ఏంటనేది ఆసక్తికరంగా మారింది.
News March 5, 2026
ఇరాన్‌పై US పోరు వెనుక మతం రంగు?

ఇరాన్‌పై దాడులను సమర్థించుకునే క్రమంలో US తమ సైనికులకు మతసిద్ధాంతాలను చొప్పిస్తున్నట్లు రిపోర్ట్స్ రావడం కలకలం రేపుతోంది. దాదాపు 40 యూనిట్ల నుంచి 110 ఫిర్యాదులు వచ్చినట్లు మిలిటరీ రిలీజియస్ ఫ్రీడమ్ ఫౌండేషన్ వెల్లడించింది. బైబిల్‌లో పేర్కొన్న అర్మాగెడ్డాన్ (చెడుపై దేవుడి పోరు)ను సృష్టించేందుకు ఇరాన్‌పై దాడి చేయమని ట్రంప్‌కు జీసస్ సందేశం పంపారని కమాండర్ అధికారులకు చెప్పినట్లు రిపోర్ట్ పేర్కొంది.


