News February 16, 2025
చెత్త విషయంలో తల్లి, కొడుకుపై కత్తితో దాడి

గుత్తి ఆర్ఎస్‌లో చెత్త పడేసే విషయంలో ఇరువర్గాల మధ్య ఆదివారం ఘర్షణ చోటుచేసుకుంది. ఇంటిముందు చెత్త పడేశారని వంశీ, అతని తల్లి సాయమ్మపై రిజ్వానా, రసూల్ కత్తితో దాడి చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడిన వంశీ, సాయమ్మను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం రెఫర్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
Similar News
News January 17, 2026
అనంతపురం: భార్యను బండరాయితో మోదిన భర్త

అగ్నిసాక్షిగా మూడు ముళ్ళు వేసిన భర్త కట్టుకున్న భార్యకు కాలయముడయ్యాడు. బండరాయితో భార్య తలపై మోది హత్యాయత్నం చేశాడు. ఈ ఘటన రాయదుర్గం మండలంలోని టి.వీరాపురంలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. రక్తపు మడుగులో ఉన్న భార్య శివగంగమ్మను ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఘటనపై కేసు నమోదు చేసి భర్త సుంకన్నను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News January 16, 2026
అనంత: మరదలిని సుత్తితో కొట్టి చంపిన బావ

హైదరాబాద్ జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధి శ్రీరామ్‌నగర్‌లో గురువారం సాయంత్రం దారుణ హత్య జరిగింది. సొంత మరదలిని(17) సుత్తితో కొట్టి బావ హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు అనంతపురానికి చెందిన పవన్ కుమార్(25)గా గుర్తించారు. హత్యకు గల వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు జగద్గిరిగుట్ట పోలీసులు వెల్లడించారు.
News January 16, 2026
అనంత: కొండెక్కిన కోడి ధరలు

ఫర్వాట సందర్భంగా గుత్తిలో చికెన్, మటన్ ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. కేజీ చికెన్ ధర రూ.270, స్కిన్ లెస్ రూ.290 పలుకుతోంది. మరోపక్క కేజీ మటన్ రూ. 750 ఉండగా.. ఒక్కసారిగా రూ.50 పెరిగి రూ.800 కి విక్రయిస్తున్నట్లు మటన్ షాప్ నిర్వాహకుడు ఖురేషి అన్వర్ తెలిపారు. గుంతకల్లులో కేజీ చికెన్ రూ.270 ఉండగా, అనంతపురంలో రూ.260-270 ఉంది.


