News February 16, 2025

పన్నుల వసూళ్లలో హుజూరాబాద్ రెండో స్థానం

image

ఇంటి పన్నుల వసూళ్లలో HZB మున్సిపాలిటీ రాష్ట్రంలో 2వ స్థానంలో నిలిచిందని కమిషనర్ సమ్మయ్య తెలిపారు. గతంలో వసూళ్లలో 5వ స్థానంలో ఉన్నదానిని తాను బాధ్యతలు చేపట్టిన తర్వాత ఉద్యోగుల సహకారంతో రూ.2.03కోట్లు వసూలుచేసి, 76.95శాతం వసూళ్లతో రికార్డు సాధించగలిగామన్నారు. మున్సిపల్ పరిధిలో ఇంటి పన్ను కట్టేవారు 9,431 మంది ఉన్నారన్నారు. ఉద్యోగులు, ప్రజల సహకారంతో రాష్ట్రంలో మొదటి స్థానం కోసం కృషి చేస్తున్నామన్నారు.

Similar News

News November 12, 2025

హనుమాన్ చాలీసా భావం – 7

image

విద్యావాన గుణీ అతిచాతుర| రామ కాజ కరివే కో ఆతుర||
హనుమంతుడు గొప్ప విద్యావంతుడు. సద్గుణాలు కలవాడు. అత్యంత తెలివైనవాడు. ఎల్లప్పుడూ రామ కార్యాన్ని పూర్తి చేయడంలో ఉత్సాహం చూపిస్తాడు. ఆయన జ్ఞానం, నైపుణ్యం, సేవా తత్పరత అపారమైనవి. ఆయనలోని ఈ తత్వాలను మనం కూడా ఆదర్శంగా తీసుకుని, విద్య, గుణాలు, తెలివితేటలతో పాటు, మన జీవిత ధర్మాన్ని నిర్వర్తించడానికి ఎల్లప్పుడూ ఉత్సాహంగా, సిద్ధంగా ఉండాలి. <<-se>>#HANUMANCHALISA<<>>

News November 12, 2025

భారీ జీతంతో రైట్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

image

రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్(<>RITES<<>>)17 ఇండివిడ్యువల్ కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 8 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిప్లొమా, బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. పోస్టును బట్టి నెలకు జీతం రూ.60వేల నుంచి రూ.2.55లక్షలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://rites.com

News November 12, 2025

శబరిమలకు కాజీపేట మీదుగా ప్రత్యేక రైళ్లు

image

అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం కాజీపేట జంక్షన్ మీదుగా రెండు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఏ. శ్రీధర్ తెలిపారు. ఈ నెల 24న చర్లపల్లి-కొట్టాయం (07115), 25న కొట్టాయం-చర్లపల్లి (07116) ఎక్స్‌ప్రెస్‌లు కాజీపేటకు చేరుకుంటాయి. ఈ రైళ్లు వరంగల్, ఖమ్మం, విజయవాడ తదితర స్టేషన్లలో ఆగుతాయి.