News March 20, 2024

సోషల్ మీడియా పోస్టులపై ప్రత్యేక నిఘా: తూ.గో ఎస్పీ

image

సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా తూ.గో జిల్లాలో ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉందని, ఈ నేపథ్యంలో ఎవరైనా సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ పి.జగదీశ్ హెచ్చరించారు. ట్రోలింగ్, ఆన్‌లైన్ వేధింపులు, తప్పుడు వార్తల ప్రచారాలపై ప్రత్యేక నిఘా ఉందని పేర్కొన్నారు. ఎక్కడైనా ఇలాంటివి జరిగితే ఆయా వాట్సప్, ఫేస్‌బుక్ గ్రూప్స్‌ అడ్మిన్లే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. SHARE IT..

Similar News

News July 8, 2024

పవన్ కళ్యాణ్‌కు మాటిచ్చి.. రంగంలోకి కలెక్టర్

image

సమస్యల పరిష్కారం నిమిత్తం 2 వారాలకొకసారి కాకినాడ కలెక్టర్ షాన్‌మోహన్ స్వయంగా పిఠాపురంలో అందుబాటులో ఉంటానని ముందుకు వచ్చినట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉప్పాడ సభా వేదికపై వెల్లడించిన విషయం తెలిసిందే. పవన్‌కు ఇచ్చిన మాట ప్రకారం ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు కలెక్టర్ షాన్‌మోహన్ సోమవారం పిఠాపురం విచ్చేశారు. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వెంటనే పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు.

News July 8, 2024

కాకినాడ: BJP గూటికి ఇద్దరు మాజీ కార్పొరేటర్లు

image

కాకినాడకు చెందిన ఇద్దరు మాజీ కార్పొరేటర్లు గోడి సత్యవతి, గరిమెళ్ల శర్మ బీజేపీ గూటికి చేరారు. గోడి సత్యవతి భర్త వెంకట్ సైతం కాషాయ కండువా కప్పుకున్నారు. గతంలో BJPలో ఉన్న వీరు YCPలో చేరారు. తిరిగి ఆదివారం సొంతగూటికి రాగా.. బీజేపీ స్టేట్ చీఫ్, రాజమండ్రి MP పురందీశ్వరి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు చిలుకూరు రామ్‌కుమార్, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

News July 8, 2024

అన్నవరం దేవస్థానానికి 2 కొత్త బస్సులు

image

అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానానికి 2 కొత్త బస్సులు అందుబాటులోకి రానున్నాయి. 40 సీట్ల సామర్థ్యం ఉన్న ఈ బస్సులను సుమారు రూ.80 లక్షల వ్యయంతో సిద్ధం చేస్తున్నారు. భక్తులు రాకపోకలు సాగించేందుకు ప్రస్తుతం ఉన్న బస్సులు పూర్తిస్థాయిలో సరిపోవటం లేదు. కొన్ని బస్సులు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి. దీంతో రెండు కొత్త బస్సులు కొనుగోలు చేస్తున్నారు.