News February 16, 2025

WGL: 19 మందిలో ఒక్కరే మహిళా అభ్యర్థి

image

వరంగల్ -ఖమ్మం -నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచిన 19 మంది అభ్యర్థులలో కేవలం ఒక్కరే మహిళా అభ్యర్థి ఉన్నారు. నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం వేంపాడు గ్రామానికి చెందిన అర్వ స్వాతి బరిలో నిలిచిన అతి చిన్న వయస్కురాలిగా (34 ఏళ్లు) ఉన్నారు. 68 ఏళ్ల వయసుతో హనుమకొండ జిల్లా దామరకు చెందిన దామర బాబురావు పెద్ద వయస్కుడిగా బరిలో ఉన్నారు. ఫిబ్రవరి 27 తేదీ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది.

Similar News

News September 18, 2025

నిర్మల్: నీరు నిలిస్తే.. నేల నవ్వుతుంది..!

image

భూమిపై ఉన్న జీవరాసుల మనుగడకు నీరు ఎంతో అవసరం. నీటిని నిర్లక్ష్యం చేస్తే భూమి నిర్జీవ గ్రహంగా మారుతుంది. ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో నీటి ఎద్దడి సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ వర్షాకాలంలో దిలావర్పూర్ మండలంలోని చెరువులు నీటితో నిండి కళకళలాడుతున్నాయి. వర్షపు నీటిని వృథా చేయకుండా సాగునీటి అవసరాలకు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు, నిపుణులు సూచిస్తున్నారు.
#నేడు నీటి పర్యవేక్షణ దినోత్సవం.

News September 18, 2025

పల్నాడులో బార్లకు రాని దరఖాస్తులు

image

పల్నాడు జిల్లాలో బార్ లైసెన్స్‌ల కోసం వ్యాపారులు ముందుకు రావడం లేదు. ఒకప్పుడు లైసెన్స్‌ల కోసం ఎంత మొత్తం అయినా చెల్లించడానికి సిద్ధపడిన వ్యాపారులు, కొత్త మద్యం పాలసీ కారణంగా ఆసక్తి చూపడం లేదు. ఎక్సైజ్ అధికారులు రెండుసార్లు నోటిఫికేషన్ విడుదల చేసినా సరైన స్పందన రాలేదు. జిల్లాలో మిగిలిన 30 బార్లలో కేవలం 8 బార్లకు మాత్రమే 32 దరఖాస్తులు వచ్చాయి.

News September 18, 2025

వరంగల్: ఈత కల్లు సీజన్ షురూ..!

image

ఓరుగల్లు జిల్లాలో తాటికల్లుకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం తాటికల్లు సీజన్ పూర్తై, ఈతకల్లు సీజన్ మొదలవుతోంది. గౌడన్నలు ఈదులను గీయడంతో కల్లు పారడం మొదలైంది. దసరా నాటికి పూర్తి స్థాయిలో కల్లు అందుబాటులోకి వస్తుంది. ఉమ్మడి జిల్లాలోని గోపనపల్లి, కల్లెడ, గట్టికల్, పాలకుర్తి, పాకాల, మడిపల్లి, కంఠాత్మకూర్, శాయంపేట, ఆత్మకూర్, బ్రాహ్మణపల్లి, వల్మిడి, తాల్లపూపల్లి వంటివి కల్లుకు ఫేమస్ ప్లేసులు.