News February 16, 2025

WGL: 19 మందిలో ఒక్కరే మహిళా అభ్యర్థి

image

వరంగల్ -ఖమ్మం -నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచిన 19 మంది అభ్యర్థులలో కేవలం ఒక్కరే మహిళా అభ్యర్థి ఉన్నారు. నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం వేంపాడు గ్రామానికి చెందిన అర్వ స్వాతి బరిలో నిలిచిన అతి చిన్న వయస్కురాలిగా (34 ఏళ్లు) ఉన్నారు. 68 ఏళ్ల వయసుతో హనుమకొండ జిల్లా దామరకు చెందిన దామర బాబురావు పెద్ద వయస్కుడిగా బరిలో ఉన్నారు. ఫిబ్రవరి 27 తేదీ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది.

Similar News

News April 18, 2026

త్వరలోనే వ‌రంగ‌ల్ ఎయిర్ పోర్ట్‌కు శంకుస్థాపన: పొంగులేటి

image

సచివాలయంలో ఎయిర్ పోర్ట్ అథారిటీ సదరన్ రీజియన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్ రాజ్ కిషోర్‌, ఏవియేష‌న్ డైరెక్ట‌ర్ భ‌ర‌త్‌రెడ్డి, ఇతర అధికారులతో తెలంగాణ ప్ర‌భుత్వం నిర్మించ‌త‌ల‌పెట్టిన ఎయిర్ పోర్ట్‌ల‌పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రివ్యూ నిర్వహించారు. వ‌రంగ‌ల్ ఎయిర్ పోర్ట్‌కు సంబంధించి ఇప్ప‌టికే సుమారు 953 ఎకరాల భూమిని సేకరించి కేంద్రానికి అప్పగించామని, త్వ‌ర‌లో శంకుస్ధాప‌న చేసుకోబోతునామన్నారు.

News April 18, 2026

మిషన్ ఎయిడ్స్ సురక్ష విజయవంతం చేయాలి: DMHO

image

నెల్లూరు బీవీ నగర్‌లోని DFIT కార్యాలయంలో HIV/ఎయిడ్స్‌పై DMHO వి.సుజాత, జిల్లా లెప్రసీ ఎయిడ్స్ టీబీ ఆఫీసర్ డాక్టర్ ఖాదర్ వలీ ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించారు. DMHO మాట్లాడుతూ.. HIV నియంత్రణలో అందరూ భాగస్వాములు కావాలని, జిల్లాను HIV వ్యాప్తిలేని జిల్లాగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. మారుమూల ప్రాంతాల్లో కేసులను గుర్తించి స్వచ్ఛంద సంస్థలు మరింత మెరుగైన సేవలు అందించాలని పేర్కొన్నారు.

News April 18, 2026

జగిత్యాలలో వెల్ఫేర్ వీక్ విజయవంతం చేయాలి: కలెక్టర్

image

జగిత్యాల జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సత్యప్రసాద్ పాల్గొన్నారు. ఏప్రిల్ 20 నుంచి 26 వరకు నిర్వహించనున్న వెల్ఫేర్ వీక్‌ను విజయవంతం చేయాలని సూచించారు. జిల్లాలో 117 సంక్షేమ హాస్టళ్లలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని, ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఇప్పటివరకు 66 శాతం పూర్తయిందని, జూన్ 2లోగా 100 శాతం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అధికారులు సమన్వయంతో పని చేయాలని అన్నారు.