News February 16, 2025

యాదాద్రి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు వేళాయే!

image

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 1 నుంచి 11వ తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో భాస్కరరావు తెలిపారు. 1న విశ్వక్సేన ఆరాధనతో ప్రారంభం కాగా 2న ధ్వజారోహణ, అగ్ని ప్రతిష్ఠాపన, 3 నుంచి అలంకరణ సేవలు, 7న స్వామివారి ఎదుర్కోళ్ల మహోత్సవం, 8న తిరు కళ్యాణ మహోత్సవం, 9న దివ్య విమాన రథోత్సవం, 10న చక్ర తీర్థం, 11న శతఘటాభిషేకంతో ఉత్సవాలు ముగుస్తాయి.

Similar News

News April 17, 2026

అనంతపురం జెడ్పీ సీఈఓగా విజయలక్ష్మి

image

గుంతకల్ డివిజనల్ లెవల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (DLDO)గా పనిచేస్తున్న పి.విజయలక్ష్మి పదోన్నతి పొంది, ఉమ్మడి అనంతపురం జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (CEO)గా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండే ఉత్తర్వులు జారీ చేశారు. ఆమె 15 రోజుల్లోగా నూతన బాధ్యతలు స్వీకరించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.

News April 17, 2026

మతపరమైన రిజర్వేషన్లకు మేం వ్యతిరేకం: షా

image

మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని కేంద్రమంత్రి అమిత్ షా లోక్‌సభలో స్పష్టం చేశారు. తమకు పార్టీ కంటే దేశమే ముఖ్యమని వ్యాఖ్యానించారు. రిజర్వేషన్లు జన్మత: లభిస్తాయని, మతమార్పిడులతో రావని అన్నారు. రాజ్యాంగం కూడా మతపరమైన రిజర్వేషన్లను అంగీకరించదని తెలిపారు. ఓబీసీలకు రాజ్యాధికారం కల్పించిన పార్టీ కూడా తమదేనని పేర్కొన్నారు. కులగణనను తొలి నుంచీ వ్యతిరేకించిన పార్టీ కాంగ్రెస్సేనని విమర్శించారు.

News April 17, 2026

కాకినాడ జిల్లాలో పాలిటెక్నిక్ ఎంట్రన్స్ పరీక్షల అప్డేట్

image

ఈ నెల 25న జరగనున్న పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు డీఆర్వో తిప్పేనాయక్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఆయన అధికారులతో సమీక్షించారు. జిల్లావ్యాప్తంగా 36 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఉదయం 11నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష జరుగుతుందన్నారు. పరీక్ష కేంద్రాల పరిసరాల్లో బీఎన్ఎస్ 163, 189 సెక్షన్లు అమలు చేస్తూ పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.