News February 16, 2025

రాజమండ్రి: ప్రభుత్వ నిర్లక్ష్యంతో నిండు ప్రాణాలు బలి-మాజీ ఎంపీ

image

కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఒక యువకుడి ప్రాణాలు పోయాయని మాజీ ఎంపీ, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్ ధ్వజమెత్తారు. స్థానిక గోరక్షణ పేట దగ్గర వాటర్ వర్క్స్ మరమ్మతుల నిమిత్తం రోడ్డుకు అడ్డంగా భారీ పైపు వేసి, రోడ్డు డైవర్షన్ కూడా పెట్టలేదన్నారు. దీంతో బైక్‌పై వెళ్తున్న విజయ్ అనే యువకుడు అర్ధరాత్రి పైపును ఢీ కొట్టి ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ఆయన పేర్కొన్నారు.

Similar News

News December 30, 2025

మహిళా సాధికారతపై పురందీశ్వరి సమీక్ష

image

తిరువనంతపురంలో మంగళవారం జరిగిన ‘మహిళా సాధికారత పార్లమెంటరీ కమిటీ’ సమావేశంలో రాజమండ్రి ఎంపీ పురందీశ్వరి పాల్గొన్నారు. ఎస్‌బీఐ, కెనరా బ్యాంక్ వంటి ప్రముఖ బ్యాంకులు, ఆర్థిక శాఖ ప్రతినిధులతో కలిసి స్వయం సహాయక సంఘాల పనితీరుపై సమీక్షించారు. మహిళల ఆర్థిక, సామాజిక అభివృద్ధిలో ఈ సంఘాలు పోషిస్తున్న పాత్రను ఆమె వివరించారు. మహిళలు స్వశక్తితో ఎదిగేందుకు బ్యాంకులు మరింత తోడ్పాటు అందించాలని ఎంపీ సూచించారు.

News December 30, 2025

ఇంటి వద్దే వేడుకలు చేసుకోండి: కలెక్టర్

image

నూతన సంవత్సర వేడుకలను సామాజిక బాధ్యతతో, సంయమనంతో జరుపుకోవాలని కలెక్టర్ కీర్తి చేకూరి మంగళవారం కోరారు. కుటుంబ సభ్యులతో కలిసి ఇంటి వద్దే వేడుకలు నిర్వహించుకోవాలని సూచించారు. జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులకు ఆమె నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మంచి విలువలు ప్రతిబింబించేలా కొత్త ఏడాదిని స్వాగతించాలని ఈ సందర్భంగా ఆమె పిలుపునిచ్చారు.

News December 30, 2025

మారనున్న తూర్పుగోదావరి రూపురేఖలు

image

కోనసీమ జిల్లాలో ఉన్న మండపేట, రాయవరం, కపిలేశ్వరపురం మండలాలను రాజమండ్రి రెవెన్యూ డివిజన్లో కలుపుతూ ప్రభుత్వం మంగళవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. జనవరి 1 నుంచి ఈ మూడు మండలాల ప్రజలు రాజమండ్రి ఆర్డీవో పరిధిలో సేవలు పొందనున్నారు. గత కొంతకాలంగా ఉన్న డిమాండ్ నెరవేరడంపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పరిపాలన సౌలభ్యం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.