News February 16, 2025
కోనసీమ: గుడ్డుకీ గడ్డు కాలం..భారీగా పడిపోయిన ధర

బర్డ్ ప్లూ దెబ్బకు గుడ్ల విక్రయాలు గణనీయంగా తగ్గాయి. రూ.4.90 గుడ్డు ధర రూ.4.55కు పడిపోయిందని వ్యాపారులు తెలిపారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో గుడ్ల ఉత్పత్తి 1.30 కోట్ల మేర ఉండగా స్థానికంగా వినియోగం 30 శాతం ఉంటుంది. మిగిలిన 70 శాతం గుడ్లు పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఛత్తీస్గఢ్, అస్సాం, మేఘాలయ తదితర రాష్ట్రాలకు ఎగుమతవుతాయి. ట్రెడర్లు బర్డ్ ప్లూ పేరుతో కొంత మేర ధర తగ్గించినట్లు చెబుతున్నారు.
Similar News
News July 6, 2025
సింహాచలం గిరి ప్రదక్షిణకు ట్రాఫిక్ ఆంక్షలు

గిరి ప్రదక్షిణ రూట్లో వాహనాల రాకపోకలను నిషేధిస్తూ ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి తెలిపారు. 9వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 10వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని సూచించారు. గిరి ప్రదక్షిణలో పాల్గొనే భక్తులు వాహనాలను పార్కింగ్ చేసుకునేందుకు నిర్దేశిత ప్రాంతాలను గుర్తించామన్నారు.
News July 6, 2025
భక్తుల కొంగు బంగారం.. కొమ్మాల

వరంగల్ జిల్లా గీసుకొండ మండలం కొమ్మాల గుట్టపై స్వయంభుగా వెలిసిన శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. చుట్టూ పచ్చని పొలాలతో గుట్టపై ఈ దేవాలయం ఉంది. ఉమ్మడి జిల్లాలో ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన ఈ ఆలయంలో ప్రతియేటా హోలీ సందర్భంగా జాతర జరుగుతుంది. మిగతా రోజుల్లోనూ భక్తులు స్వామి వారిని దర్శించుకుంటారు. ఇక్కడి రైతులు తొలి పంటను స్వామివారికి అందిస్తుంటారు.
News July 6, 2025
వరంగల్ జిల్లాలో ఐదు పాఠశాలలకు కొత్త భవనాలు

వరంగల్ జిల్లాలో ఐదు పాఠశాలల్లో అదనంగా నూతన భవనాలను నిర్మించేందుకు ప్రభుత్వం అనుమతించిందని కలెక్టర్ సత్య శారద తెలిపారు. గీసుగొండ మండలం నందనాయక్ తండా, నర్సంపేట మండల బోజ్యానాయక్ తండా, చిన్న గురజాల, పార్శ్య నాయక్ తండా, స్వామి నాయక్ తండాల్లో ఏర్పాటు చేయనున్న నూతన భవన నిర్మాణాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సమావేశంలో డీఈవోను ఆదేశించారు.