News February 16, 2025
పెద్దగట్టు జాతరలో అర్ధరాత్రి కీలక ఘట్టం

యాదవుల కులదైవమైన ప్రసిద్ధిగాంచిన పెద్దగట్టు లింగమంతులస్వామి జాతర ఆదివారం ప్రారంభమైంది. మేడారం తర్వాత రాష్ట్రంలో అతిపెద్ద జాతరగా పేరుగాంచిన గొల్లగట్టు జాతర సమ్మక్క-సారలమ్మ జాతరలాగే 2ఏళ్లకోసారి జరుగుతుంది. ఈ జాతరలో కీలక ఘట్టమైన దేవరపెట్టె(అందనపు చౌడమ్మ పెట్టె) తరలింపు కార్యక్రమాన్ని ఈరోజు అర్ధరాత్రి నిర్వహించనున్నారు. కాగా శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ జాతర గురించి అనేక కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి.
Similar News
News January 11, 2026
నెల్లూరు: 20 మీటర్లు ముందుకొచ్చిన సముద్రం

నెల్లూరు జిల్లాలో వాయుగుండం ప్రభావంతో చలి తీవ్రత పెరిగింది. ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉండగా, కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తున్నాయి. సముద్రం సుమారు 20 మీటర్ల వరకు ముందుకు రావడంతో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అలల తీవ్రత ఎక్కువగా ఉండటంతో మత్స్యకారులు 5 రోజుల పాటు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. తీర గ్రామాల్లో అధికారులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.
News January 11, 2026
న్యాయం గొప్పదా? ధర్మం గొప్పదా?

సమాజానికి రెండూ అవసరమే. కానీ, న్యాయం కన్నా ధర్మమే గొప్పది, విస్తృతమైనది. ఇది మన అంతరాత్మ, నైతికతకు సంబంధించినది. ఓ వ్యక్తి తన బాధ్యత, కర్తవ్యాన్ని నిబద్ధతతో నిర్వహించడమే ధర్మం. ఇదే శాశ్వత సత్యం. న్యాయం కేవలం చట్టబద్ధమైనది. సాక్ష్యాధారాల ఆధారంగా, క్రమశిక్షణ కోసం మనం ఏర్పరుచుకున్నది. న్యాయం పరిస్థితులను బట్టి మారవచ్చు. కానీ ధర్మం అలా కాదు. ఇది మానవత్వాన్ని కాపాడుతుంది. అందుకే ధర్మమే గొప్పది.
News January 11, 2026
NLG: ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలచే భర్తీ చేయబడే ఉద్యోగాలతోపాటు బ్యాంకింగ్, RRB ఇతర పోటీ పరీక్షలకు ఎస్సీ స్టడీ సర్కిల్స్‌లో ఉచిత రెసిడెన్షియల్, శిక్షణకు అసక్తి కలిగిన అభ్యర్థులు ఈనెల 30లోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి బి.శశికళ తెలిపారు. అభ్యర్థులను పోటీ పరీక్ష నిర్వహించి మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారని, ఫిబ్రవరి 8న జరిగే పరీక్షలో పాల్గొనాలని కోరారు.


