News February 16, 2025
లక్షెట్టిపేటలో భార్యను హత్య చేసిన భర్త

భార్యను భర్త దారుణంగా హత్య చేసిన ఘటన లక్షెట్టిపేటలో జరిగింది. SI సతీశ్ వివరాల ప్రకారం.. గోదావరి రోడ్డుకు చెందిన గణేశ్ తన భార్య రాజ కుమారిని సిమెంటు ఇటుక, బండరాయితో కొట్టి చంపాడు. కాగా కొద్ది రోజులుగా గణేశ్ మద్యం తాగి వచ్చి భార్యకు ఇతరులతో వివాహేతర సంబంధం ఉందని గొడవ పడేవాడన్నారు. ఆమె ఆదివారం తెల్లవారుజామున బాత్రూమ్‌కు వెళ్ళగా గణేశ్ వెనకాలే వెళ్లి తలపై కొట్టి చంపాడని ఎస్ఐ వెల్లడించారు.
Similar News
News November 10, 2025
వరంగల్: బాలికను వేధించిన ఘటన.. యువకుల దాడి

గ్రేటర్ వరంగల్ పరిధి కరీమాబాద్ ఎస్‌ఆర్‌ఆర్ తోట సమీపంలోని ఓ ప్రైవేట్ స్కూల్ వద్ద బాలికను వేధించిన ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. వేధించిన యువకుడిని ప్రశ్నించినందుకు బాధితురాలి తండ్రి రాజేందర్, మామయ్య
రాకేశ్‌పై కొందరు యువకులు దాడికి దిగారు. దాడిలో గాయపడిన వారిని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై బాధితులు మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
News November 10, 2025
భాగ్యనగరంలో ₹304 కోట్లతో ఐకానిక్ బ్రిడ్జి

TG: భాగ్యనగరానికి మరో ఐకానిక్ వంతెన రానుంది. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులో భాగంగా మీర్ ఆలం ట్యాంక్ వద్ద ఈ వంతెన నిర్మాణానికి ప్రభుత్వం టెండర్లు ఖరారు చేసింది. ₹304 కోట్లతో శాస్త్రిపురం నుంచి చింతల్‌మెట్ మీదుగా బెంగళూరు NHని కలుపుతూ దీన్ని నిర్మించనున్నారు. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు CM ప్రాధాన్యమివ్వడం తెలిసిందే. కాగా HYDలో దుర్గం చెరువుపై గతంలో కేబుల్ బ్రిడ్జి నిర్మించారు.
News November 10, 2025
గద్వాలలో 76 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

గద్వాల జిల్లాలో మొత్తం 81 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు గాను ఇప్పటికే 76 ప్రారంభించామని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ బి.ఎం.సంతోష్ తెలిపారు. సోమవారం హైదరాబాద్ సచివాలయం నుంచి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన ఈ విషయం చెప్పారు.


