News February 16, 2025
రాజబాబు లేనిలోటు తీరనిది: జగన్

ద్వారకాతిరుమల మండలం సీహెచ్ పోతేపల్లికి చెందిన YCP రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెలికాని రాజబాబు కన్నుమూశారు. ఆయన మృతిపై మాజీ సీఎం జగన్ స్పందించారు. ‘సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నాయకుడిని కోల్పోవడం బాధాకరం. రాజబాబు మరణం మా పార్టీకి తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’ అంటూ జగన్ ట్వీట్ చేశారు.
Similar News
News April 17, 2026
అపార్టుమెంట్లలో EV ఛార్జింగ్ పాయింట్లు

TG: భవిష్యత్తు అవసరాల దృష్ట్యా GOVT, PVT భాగస్వామ్యంలో మరిన్ని EV ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని CS రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. EVల సంఖ్య పెరుగుతున్నందున గ్రామీణ, పట్టణ ప్రజలకు వీటిని అందుబాటులో ఉంచాలన్నారు. వీటి మ్యాపింగ్‌కు డ్యాష్ బోర్డును అభివృద్ధి చేయాలన్నారు. నగరాల్లోని అపార్టుమెంట్లలో ఈ ఛార్జింగ్ పాయింట్లను తప్పనిసరి చేయనున్నట్లు ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ తెలిపారు.
News April 17, 2026
గంగ జాతరకు CM చంద్రబాబుకు ఆహ్వానం

కుప్పం శ్రీప్రసన్న తిరుపతి గంగమ్మ జాతరకు సతీసమేతంగా రావాలంటూ CM చంద్రబాబుకు గంగమ్మ గుడి ఛైర్మన్ BMK రవిచంద్రబాబు ఆహ్వాన పత్రికను అందజేశారు. అమరావతిలో CMను ఆయన నివాసానికి వెళ్లి జాతర ఆహ్వాన పత్రిక ఇచ్చారు. గంగ జాతరలో భాగంగా మే 20న అమ్మవారి విశ్వరూప దర్శనం రోజు CM చంద్రబాబు దంపతులు రానున్నట్లు సమాచారం.
News April 17, 2026
మెదక్: వేసవి టూర్‌కు వెళ్తున్నారా..? జాగ్రత్త !

వేసవి సెలవులు, పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో దొంగల పట్ల అప్రమత్తంగా ఉండాలని మెదక్ ప్రజలకు ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు సూచించారు. కుటుంబంతో కలిసి ఊళ్లకు వెళ్లేవారు ఇంటి భద్రతపై నిఘా ఉంచాలని, పరిసరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం శ్రేయస్కరమని తెలిపారు. అనుమానిత వ్యక్తుల కదలికలపై నిశితంగా గమనిస్తూ పోలీసులకు సమాచారం అందించాలని ఆయన కోరారు. స్వయం జాగ్రత్తలే ఆస్తికి రక్షణ అని పేర్కొన్నారు.


