News February 16, 2025

అనకాపల్లి: మాస్టర్స్ అథ్లెటిక్స్‌లో మెరిసిన నేవీ ఉద్యోగి

image

అనకాపల్లి జిల్లా దేవరాపల్లిలోని శంభు వానిపాలానికి చెందిన నేవీ ఉద్యోగి అప్పన్న దొర జాతీయస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్‌లో సత్తా చాటారు. రాజస్థాన్‌లో ఈ నెల 6, 7, 8 తేదీల్లో జరిగిన మాస్టర్స్ అథ్లెటిక్స్‌లో 45 ఏళ్ల విభాగంలో 4×400 మీటర్ల పరుగు పందెంలో బంగారు పతకాన్ని, 4×100 200 మీటర్ల పరుగు పందెంలో వెండి పతకం, లాంగ్ జంప్, ట్రిపుల్ జంప్ కాంస్య పతకం పొందారు. ఆదివారం ఆయనను గ్రామస్థులు సత్కరించారు.

Similar News

News November 10, 2025

19న మహిళలకు చీరల పంపిణీ

image

TG: మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ఈ నెల 19న 65 లక్షల మంది మహిళా సంఘాల సభ్యులకు చీరల పంపిణీకి రంగం సిద్ధమైంది. ఇప్పటికే 4.10 కోట్ల మీటర్ల సేకరణ జరిగిందని, వారంలో ఉత్పత్తి పూర్తవుతుందని అధికారులు తెలిపారు. గతంలో బతుకమ్మ చీర ఖరీదు రూ.350 ఉండగా, ఇందిరా మహిళా శక్తి చీరకు రూ.480గా నిర్ణయించినట్లు పేర్కొన్నారు. కాగా భారీగా చీరల ఆర్డర్లతో చేనేత సంఘాలకు చేతి నిండా పనిదొరికినట్లయ్యింది.

News November 10, 2025

వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు సూసైడ్

image

వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు బలవన్మరణాలకు పాల్పడ్డారు. మద్యం మానుకోవడంలేదని పెనుకొండ(M) గుట్టూరులో బిహార్‌కు చెందిన PK రాయ్ భార్య అంజలికుమారి ఉరేసుకుంది. భర్త కియాలో పనిచేస్తాడు. ధర్మవరంలో భవన నిర్మాణ కూలీ శివ(36) మద్యానికి డబ్బులు ఖర్చు చేస్తున్నాడని భార్య నవనీత ప్రశ్నించడంతో ఉరేసుకున్నాడు. మకడశిర(M) మణూరుకు చెందిన మతిస్థిమితం లేని కదురప్ప(46) చెట్టుకు ఉరేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

News November 10, 2025

నల్గొండ: తగ్గిన ఉష్ణోగ్రతలు.. చలి షురూ

image

ఉమ్మడి జిల్లాలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఈనెల మొదటి వారం నుంచి టెంపరేచర్ తగ్గి చలి పెరుగుతుండడంతో వృద్ధులు, చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి చల్లటి గాలులు వీస్తున్నాయని పలువురు చెబుతున్నారు. ఫిబ్రవరి రెండో వారం వరకు చలి ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే వాతావరణ శాఖ చలిగాలులకు సంబంధించి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదివారం నల్గొండలో ఉష్ణోగ్రత 20 డిగ్రీలుగా నమోదైంది.