News February 16, 2025
నీతా అంబానీకి అరుదైన గౌరవం

రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ నీతా అంబానీకి అరుదైన గౌరవం దక్కింది. దార్శనికత, దాతృత్వం, సామాజిక సేవలతో గ్లోబల్ ఛేంజ్‌మేకర్‌గా నిలుస్తున్నారని USAలోని మసాచుసెట్స్ ప్రభుత్వం కొనియాడింది. విద్య, ఆరోగ్యం, స్పోర్ట్స్, తదితర రంగాల్లో ఆమె సేవలు గొప్పవని పేర్కొంది. ఈ మేరకు ప్రతిష్ఠాత్మక ‘గవర్నర్ ప్రశంసాపత్రం’ అందజేసింది. బోస్టన్‌లో ఆ రాష్ట్ర గవర్నర్ హీలీ అవార్డ్ అందజేసినట్లు నీతా అంబానీ ఆఫీస్ తెలిపింది.
Similar News
News April 20, 2026
విజయ్ విడాకుల కేసు.. నేడే విచారణ

TVK అధినేత విజయ్-సంగీత విడాకుల కేసు నేడు చెంగల్పట్టు కోర్టులో విచారణకు రానుంది. విచారణకు హాజరుకావాలని ఇప్పటికే విజయ్‌కు కోర్టు నోటీసులిచ్చింది. కాగా విజయ్, సంగీత పరస్పర ఆమోదంతో విడిపోయేందుకు శనివారం లాయర్లతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. సెటిల్‌మెంట్ కింద రూ.250 కోట్లు ఇవ్వాలని సంగీత కోరగా రూ.35 కోట్లు ఇచ్చేందుకు విజయ్ ఓకే చెప్పినట్లు సమాచారం.
News April 20, 2026
8th పే కమిషన్.. ఒక్కో ఉద్యోగికి రూ.10 లక్షలు!

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 8th పే కమిషన్ జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఇప్పటికే డీఏ పెరగగా ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 3.833గా ఉండాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. దీనికి ఆమోదం లభిస్తే బేసిక్ శాలరీ రూ.18వేల నుంచి రూ.69వేలకు పెరగనుంది. అలాగే అరియర్స్ రూపంలో లెవల్-1 ఎంప్లాయీస్ దాదాపు రూ.10 లక్షలకు పైగా అందుకోనున్నట్లు సమాచారం. కాగా తుది నివేదికను సమర్పించడానికి 8వ వేతన సంఘానికి మే 2027 వరకు గడువు ఉంది.
News April 20, 2026
హ్యాపీ బర్త్‌డే మావయ్య: NTR

ఏపీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబుకు యంగ్ టైగర్ ఎన్‌టీఆర్ హ్యాపీ బర్త్‌డే మావయ్యగారు అని SMలో శుభాకాంక్షలు తెలిపారు. ఇలాగే ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని.. ఇదే నిబద్ధత, విజన్‌తో ప్రజలకు సేవలు కొనసాగించాలని కోరుకున్నారు. మీ నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి కొనసాగాలని ఆశిస్తున్నానని Xలో పోస్ట్ చేశారు. మరోవైపు వైసీపీ చీఫ్ జగన్ కూడా చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు.


