News February 16, 2025
మంథని: రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలు

మంథని-గోదావరిఖని ప్రధాన రహదారిపై ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. విలోచవరం గ్రామానికి చెందిన తోట రాయమల్లును ఎదురుగా వచ్చిన మరో బైక్ ఢీకొనడంతో తలకు, కాలుకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో కాలు విరిగ్గా భయానకమైన దృశ్యాలు కనబడుతున్నాయి. స్థానికుల సాయంతో 108లో ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News April 18, 2026
SRHలోకి సౌతాఫ్రికా పేసర్

IPL: గాయం కారణంగా టోర్నీకి దూరమైన డేవిడ్ పేన్ స్థానంలో SRH మరో పేసర్‌ను తీసుకుంది. సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్ గెరాల్డ్ కోయెట్జీని రూ.2కోట్లకు జాయిన్ చేసుకుంది. ఈ విషయాన్ని IPL, ఫ్రాంచైజీ అఫీషియల్‌గా ప్రకటించాయి. కోయెట్జీ గతంలో ముంబై, గుజరాత్ జట్ల తరఫున 14 మ్యాచులు ఆడి 15 వికెట్లు పడగొట్టారు. సౌతాఫ్రికా తరఫున ఇప్పటివరకు 4 టెస్టులు, 14 వన్డేలు, 18 టీ20ల్లో 67 వికెట్లు తీశారు.
News April 18, 2026
కృష్ణా: 10 నెలల బాలుడిని కిడ్నాప్ చేసి రూ. 1.50 లక్షలకు అమ్మేశారు!

కృష్ణా జిల్లాలో పది నెలల బాలుడి విక్రయం ఉదంతం తీవ్ర కలకలం సృష్టించింది. పెనమలూరులో కిడ్నాప్‌కు గురైన బాలుడిని, నిందితులు మచిలీపట్నంలోని ఒక దంపతులకు రూ. 1.50 లక్షలకు విక్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు కేవలం 24 గంటల్లోనే గాలింపు చర్యలు చేపట్టి బాలుడిని రక్షించారు. ఈ అక్రమ విక్రయ ఘటనలో ఏడుగురి ప్రమేయం ఉన్నట్లు గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు.
News April 18, 2026
వేల్పుగొండలో అత్యధిక ఉష్ణోగ్రత

కామారెడ్డి జిల్లాలో ఎండల తీవ్రత పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో పల్వంచ మండలంలోని వేల్పుగొండలో అత్యధికంగా 43.9°C ఉష్ణోగ్రత నమోదైంది. దోమకొండ, బీబీపేట, మద్నూర్‌లో 43.8°C, బిక్కనూరులో 43.7°C నమోదు కాగా, మహమ్మద్ నగర్ మండలంలో అత్యల్పంగా 40°C నమోదైంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.


