News February 16, 2025

ఆసిఫాబాద్‌లో ప్రశాంతంగా కొనసాగిన సీఓఈ పరీక్షలు

image

ఆసిఫాబాద్‌లోని పీటీజీ గిరిజన గురుకులంలో ఏర్పాటు చేసిన సీఈవో పరీక్ష కేంద్రాన్ని సెంటర్ చీఫ్ సూపరింటెండెంట్ కారం భద్రయ్య పరిశీలించారు. 320 మందికి గాను 304 మంది పరీక్షలు రాయాగా 20 మంది గైర్హాజరైనట్లు వెల్లడించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. తిర్యాణి కళాశాల అధ్యాపకురాలు సౌమ్య అబ్జర్వర్‌గా వ్యవహరించారు.

Similar News

News September 13, 2025

పెనుకొండలో భార్యను హత్య చేసిన భర్త

image

పెనుకొండలో భార్యను భర్త హత్య చేసిన ఘటన చోటుచేసుకుంది. అల్తాఫ్ ఖాన్ తన భార్య సుమియా భాను(27)ను పుట్టింటి నుంచి డబ్బు తీసుకురావాలని గొడవపడేవాడు. దీనిపై కేసు నమోదైంది. అప్పట్నుంచి పిల్లలతో పుట్టింటిలోనే ఉంటోంది. ఆగస్టు 26న పిల్లలను, ఆమెను తన గదికి తీసుకెళ్లి అల్తాఫ్ దారుణంగా కొట్టాడు. తీవ్రగాయాలైన సుమియాను కుటుంబీకులు హిందూపురం ఆస్పత్రికి తరలించారు. అనంతరం బెంగళూరు తీసుకెళ్లగా శుక్రవారం మృతిచెందింది.

News September 13, 2025

ఈనెల 14న ఎన్డీఏ, సీడీఎస్ పరీక్షలు: డీఆర్ఓ

image

UPSC ఆధ్వర్యంలో ఈనెల 14న నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నావల్ అకాడమీ, కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ పరీక్షలు జరుగుతాయని DRO మాలోలా తెలిపారు. రెండు కేంద్రాలలో 252 మంది అభ్యర్థులు హాజరవుతారు. UPSC నిబంధనలకు అనుగుణంగా పరీక్షలు పగడ్బందీగా నిర్వహిస్తామన్నారు. JNTU, KSN ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలల్లో పరీక్షలు జరుగుతాయన్నారు.

News September 13, 2025

ఈమె తల్లి కాదు.. రాక్షసి

image

TG: ప్రియుడి కోసం కన్నకూతురినే గొంతునులిమి చంపేసిందో కర్కశ తల్లి. మెదక్(D) శభాష్‌పల్లికి చెందిన మమతకు భాస్కర్‌తో వివాహం కాగా పిల్లలు చరణ్(4), తనుశ్రీ(2) ఉన్నారు. భాస్కర్‌తో కలిసి ఉండలేనంటూ పుట్టింటికి వెళ్లిన ఆమెకు ఫయాజ్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. కొడుకును తన తల్లి వద్దే వదిలేసి పాపను తీసుకొని ప్రియుడితో వెళ్లిపోయింది. అదేరోజు తనుశ్రీని గొంతునులిమి చంపి గ్రామ శివారులో పాతిపెట్టింది.