News February 16, 2025

ప్రత్తిపాటి పుల్లారావు ఆగడాలు పీక్స్‌కు చేరాయి: YCP

image

AP: చిలకలూరిపేటలో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆగడాలు పీక్స్‌కు చేరాయని వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. మాజీ మంత్రి విడదల రజినిపై కోపంతో ఆమె మామపై దాడి చేయించారని ఆరోపించింది. 83 ఏళ్ల వ్యక్తి అని కూడా చూడకుండా తన అనుచరులతో కారు అద్దాలను ధ్వంసం చేయించి హత్యాయత్నం చేశారని ట్వీట్ చేసింది. మరీ ఇంత నీచ రాజకీయాలా చంద్రబాబు? అని ప్రశ్నించింది.

Similar News

News April 18, 2026

తండ్రయిన రషీద్ ఖాన్

image

అఫ్గాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ తండ్రయ్యారు. తన భార్య మగబిడ్డకు జన్మనిచ్చినట్లు ఆయన సోషల్ మీడియాలో వెల్లడించారు. చిన్నారికి అజ్లాన్ ఖాన్ అనే పేరు పెట్టినట్లు తెలిపారు. రషీద్ ప్రస్తుతం ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌కు ఆడుతున్న విషయం తెలిసిందే.

News April 18, 2026

అత్యాచారాలు చేసేవారిపై కాకుండా ప్రశ్నించే వారిపై కేసులా: YS జగన్

image

AP: ప్రశ్నించే గొంతుకలకు చంద్రబాబు ప్రభుత్వం సంకెళ్లు వేస్తోందని జగన్ విమర్శించారు. బీసీ వర్గానికి చెందిన సీనియర్ జర్నలిస్టుగా పని చేసిన పూడి శ్రీహరి చేసిన తప్పేంటని ప్రశ్నించారు. అక్రమ కేసు పెట్టడానికి, ఇంట్లో సోదాలు చేయడానికి అతనేమైనా ఉగ్రవాదా? అని మండిపడ్డారు. బాలికలు, మహిళలపై అత్యాచారాలు జరుగుతుంటే చర్యలు తీసుకోని మీరు ఎవరైనా ప్రశ్నిస్తే మాత్రం కేసులు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని నిలదీశారు.

News April 18, 2026

భారత నౌకలపై IRGC కాల్పులు!

image

హార్ముజ్‌‌ను దాటేందుకు ప్రయత్నించిన రెండు భారత నౌకలపై IRGC కాల్పులు జరిపినట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది. అందులో ఒకటి 20 లక్షల బ్యారెళ్ల ఇరాక్ ఆయిల్‌తో వెళ్తోందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆ రెండు భారత షిప్పులు హార్ముజ్ నుంచి తిరిగి వెనక్కి వెళ్లిపోయాయని తెలిపింది. నౌకలతో పాటు అందులోని సిబ్బంది క్షేమంగా ఉన్నట్లు సమాచారం. దీంతో ఢిల్లీలోని ఇరాన్ రాయబారికి భారత ప్రభుత్వం సమన్లు ఇచ్చే ఛాన్స్ ఉంది.