News March 20, 2024

వలస కూలీల ట్రాక్టర్ బోల్తా.. 20 మందికి గాయాలు

image

చర్ల మండలంలోని దోసిల్లపల్లి గ్రామ మూలమలుపు వద్ద బుధవారం అదుపుతప్పి వలస కూలీల ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో 20 మందికి స్వల్ప గాయాలు, నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చర్ల ప్రాథమిక వైద్యశాలకు తరలించారు. తీవ్రంగా గాయపడిన నలుగురిని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. వీరంతా ఛత్తీస్‌గఢ్
రాష్ట్రం చింతల్ నార్ స్టేషన్ పరిధిలోని కొత్తగూడ గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు.

Similar News

News September 10, 2025

ఖమ్మం: ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

image

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని నిరుద్యోగ యువతులకు భవన నిర్మాణ కార్మిక(మేస్త్రి) పని, నర్సరీ మేనేజ్మెంట్, మొబైల్ రిపేరింగ్‌పై ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు డైరెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. 30 రోజుల శిక్షణతో పాటు భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలోని తమ కార్యాలయంలో ఈ నెల 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News September 10, 2025

లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి : సీపీ

image

ఈ నెల 13న జరగనున్న జాతీయ లోక్ అదాలత్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఖమ్మం సీపీ సునీల్ దత్ పిలుపునిచ్చారు. చిన్నచిన్న కేసుల కోసం కోర్టుల చుట్టూ తిరిగి సమయం, డబ్బు వృథా చేసుకోవద్దని ఆయన సూచించారు. రాజీపడదగిన క్రిమినల్, సివిల్ కేసులను పరస్పర అంగీకారంతో లోక్ అదాలత్‌లో పరిష్కరించుకోవచ్చని ఆయన తెలిపారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని కేసుల నుంచి విముక్తి పొందాలని ఆయన ప్రజలను కోరారు.

News September 9, 2025

ఖమ్మం: ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

image

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని నిరుద్యోగ యువతులకు భవన నిర్మాణ కార్మిక (మేస్త్రి) పని, నర్సరీ మేనేజ్మెంట్, మొబైల్ రిపేరింగ్ పై ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు డైరెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. 30రోజుల శిక్షణతో పాటు భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలోని తమ కార్యాలయంలో ఈ నెల 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు.