News February 16, 2025

మహబూబాబాద్ జిల్లా ప్రజలకు కలెక్టర్ ముఖ్య గమనిక  

image

మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ ఒక ప్రకటనలో ఈరోజు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ ముగిసే వరకు జిల్లాలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం లేదని తెలిపారు. ఈ విషయాన్ని మహబూబాబాద్ జిల్లా ప్రజలు గమనించి కలెక్టరేట్‌కు వినతి పత్రాలతో రావద్దని సూచించారు. 

Similar News

News July 4, 2025

ఖమ్మం: చిన్నారి నృత్యం.. గిన్నిస్ బుక్ రికార్డులో చోటు.!

image

వేంసూరు మండలం సత్యనారాయణపురం గ్రామానికి చెందిన రమేష్ రెడ్డి-మంజీర దంపతుల పదేళ్ల కూతురు చూర్ణిక కూచిపూడి నృత్య ప్రదర్శనలో ప్రతిభ చాటింది. HYDలో జరిగిన పోటీలో 4,219 మంది నృత్యకారులతో కలిసి చూర్ణిక పాల్గొని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సాధించింది. ప్రతిభ చాటిన ఆమెకు నిర్వాహకులు శ్రీ లలిత, వసుంధర గోవిందరాజ్, శ్వేత సర్టిఫికెట్ అందజేశారు. చిన్నారికి మండల వాసులు అభినందనలు తెలుపుతున్నారు.

News July 4, 2025

NGKL: సీఎం రేవంత్ రెడ్డి జూరాలను సందర్శించాలి: జాన్ వెస్లీ

image

జూరాల ప్రాజెక్టు గేట్లు దెబ్బతిన్న విషయంపై సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి జూరాల ప్రాజెక్టును సందర్శించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. జూరాల ప్రాజెక్టును స్థానిక సీపీఎం నాయకులతో కలిసి శుక్రవారం ఆయన సందర్శించారు. సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు గేట్లకు వెంటనే మరమ్మతులు చేయించాలని కోరారు.

News July 4, 2025

నటి రన్యా రావుకు చెందిన రూ.34 కోట్ల ఆస్తులు అటాచ్

image

గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్టైన కన్నడ నటి రన్యా రావుకు సంబంధించిన రూ.34 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. రన్యా రావును బంగారం అక్రమ రవాణా, హవాలా నగదు బదిలీల కేసులో DRI అధికారులు ఈ ఏడాది మార్చి 5న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దుబాయ్‌లో బంగారం కొని భారత్‌కు తరలిస్తుండగా బెంగళూరులో అధికారులు పట్టుకున్నారు. అప్పటి నుంచి ఆమె జైలులోనే ఉన్నారు.