News March 20, 2024

నాగార్జున అంటే ఎంతో ఇష్టం: నటి

image

సీనియర్ నటి కస్తూరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను చదువుకునే రోజుల నుంచి హీరో నాగార్జున అంటే తనకు ఇష్టమని చెప్పారు. ఆ రోజుల్లోనే అక్కినేని హీరోను కలిశానని, షేక్ హ్యాండ్ కూడా ఇచ్చానని తెలిపారు. నాగార్జున టచ్ చేసిన చేయి అంటూ అంతా తాకేవారన్నారు. ఆయన అంటే ఇప్పటికీ అదే ఇష్టం ఉందని చెప్పుకొచ్చారు. కాగా ‘అన్నమయ్య’ సినిమాలో నాగార్జున సరసన కస్తూరి నటించారు. ప్రస్తుతం ఆమె సీరియళ్లలో నటిస్తున్నారు.

Similar News

News September 9, 2025

లోకో పైలట్ ఉద్యోగాల్లో రిజర్వేషన్‌పై నెట్టింట చర్చ

image

లక్షలాది ప్రయాణికుల భద్రతను ప్రత్యక్షంగా ప్రభావితం చేసే లోకో పైలట్ నియామకంలో రిజర్వేషన్లు ఉండొద్దని ఓ ప్రొఫెసర్ చేసిన ట్వీట్ వైరలవుతోంది. సిగ్నల్స్, రూట్స్, ఇంజిన్ నియంత్రణకు బాధ్యత వహించే అసిస్టెంట్ లోకో పైలట్ జాబ్‌ను తక్కువ మార్కులొచ్చిన వారికి ఎలా ఇస్తారని మండిపడ్డారు. నోటిఫికేషన్‌లో URకు 66.66 మార్కులు కట్ఆఫ్‌గా ఉంటే BC & EWSలకు 40, SCలకు 34, STలకు 25 మార్కులు ఉన్నాయి. దీనిపై మీ కామెంట్?

News September 9, 2025

వివేకా హత్య కేసు విచారణ మళ్లీ వాయిదా

image

AP: వివేకా హత్య కేసు విచారణను సుప్రీంకోర్టు మరోసారి వాయిదా వేసింది. తదుపరి దర్యాప్తు అవసరమా? లేదా? అన్నదానిపై అఫిడవిట్ దాఖలు చేయాలని సీబీఐని గతంలో ధర్మాసనం ఆదేశించింది. ఇవాళ సీబీఐ తరఫున కోర్టుకు హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు అఫిడవిట్ దాఖలుకు మరింత సమయం కావాలని కోరారు. దీంతో న్యాయస్థానం విచారణను ఈనెల 16కు వాయిదా వేసింది.

News September 9, 2025

ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్‌లో అప్రెంటీస్‌లు

image

DRDOకు చెందిన ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్‌-చాందీపూర్‌‌లో ఇంజినీరింగ్ డిగ్రీ, డిప్లొమా అప్రెంటీస్ పోస్టులకు అక్టోబర్ 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేషన్ అప్రెంటీస్‌లు పోస్టులు 32, డిప్లొమా అప్రెంటీస్‌లు 22 ఉన్నాయి. దరఖాస్తులను స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పంపాలి. వెబ్‌సైట్: https://drdo.gov.in/