News February 16, 2025

పరవాడ: టోరెంట్ ఫార్మాలో ఇద్దరి కార్మికులకు తీవ్ర అస్వస్థత

image

పరవాడ ఫార్మాసిటీలో టోరెంట్ ఫార్మా పరిశ్రమలో ఆదివారం కెమికల్ పౌడర్ ప్యాకింగ్ చేస్తుండగా ఇద్దరు కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయాన్ని ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు గనిశెట్టి తెలిపారు. అస్వస్థతకు గురైన కార్మికులు పి. రామకృష్ణ, జె. బసవేశ్వరావును ఆసుపత్రికి తరలించామన్నారు. భద్రత ప్రమాణాలు పాటించకపోవడంతో ఈ విధంగా జరిగిందన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలన్నారు.

Similar News

News November 7, 2025

పనులు మరింత వేగవంతంగా సాగాలి: హనుమకొండ కలెక్టర్

image

జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతి మరింత వేగవంతంగా సాగే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. హనుమకొండలోని కలెక్టరేట్‌లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిపై గృహ నిర్మాణ, ఆర్డీఓ, మెప్మా, ఎంపీడీవోలతో కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతి,ఇంకా ఇళ్ల నిర్మాణం మొదలు పెట్టని లబ్ధిదారుల సంఖ్యను అడిగి తెలుసుకున్నారు.

News November 7, 2025

బయోగ్యాస్ ప్లాంట్ సామర్థ్యాన్ని పెంచండి: వరంగల్ మేయర్

image

బయోగ్యాస్ ప్లాంట్ సామర్థ్యాన్ని పెంచాలని నగర మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. శుక్రవారం బల్దియా ప్రధాన కార్యాలయ ఆవరణలో గల బయోగ్యాస్ విద్యుత్ ప్లాంట్‌ను కమిషనర్ చాహత్ బాజ్ పాయ్‌తో కలిసి మేయర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సీఎంహెచ్ఓ డా.రాజారెడ్డిన, ఎంహెచ్ఓ డా.రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.

News November 7, 2025

దేవసేన, అధికారులపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు: FATHI

image

TG: ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి దేవసేన, సీఎం కార్యాలయ అధికారులపై తాము ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని ‘FATHI’ అధ్యక్షుడు రమేశ్ Dy.CM భట్టితో చర్చల సందర్భంగా తెలిపారు. తమ కామెంట్స్‌ను వక్రీకరించారన్నారు. దీన్ని ఖండిస్తూ ఇప్పటికే ఉన్నతాధికారులకు వివరణ ఇచ్చామని పేర్కొన్నారు. ఇక సమ్మె కారణంగా నిలిచిపోయిన పరీక్షలను వర్సిటీ అధికారులతో మాట్లాడి నిర్వహిస్తామని వెల్లడించారు.