News February 17, 2025
MHBD: బీఆర్ఎస్ నాయకులకు మాజీ ఎంపీ కవిత సూచన

మహబూబాబాద్ పట్టణ కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పుట్టినరోజును పురస్కరించుకొని బీఆర్ఎస్ కార్యాలయంలో వేడుకలను నిర్వహిస్తున్నట్లు మాజీ ఎంపీ మాలోతు కవిత తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రేపు 17 సోమవారం రోజు పార్టీ కార్యాలయంలో జరిగే పుట్టినరోజు వేడుకల్లో కేసీఆర్ అభిమానులు, జిల్లా పార్టీ నాయకులు, పాల్గొనాలని కోరారు.
Similar News
News November 11, 2025
PDPL: 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు: కలెక్టర్

పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష వానాకాలం 2025 పంటను సజావుగా కొనుగోలు చేయాలంటే, ధాన్యాన్ని 17% తేమ శాతం వరకు ఆరబట్టి, నాణ్యమైన ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకురావాలని రైతులకు సోమవారం సూచించారు. కొనుగోలు కేంద్రాలకు చేరిన ధాన్యం వెంటనే కొనుగోలు చేసి రైస్ మిల్లులకు తరలిస్తామన్నారు. కొనుగోలు చేసిన 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని కలెక్టర్ తెలిపారు.
News November 11, 2025
ఖమ్మం: కౌలు రైతులు పత్తి విక్రయానికి నమోదు చేసుకోవాలి: కలెక్టర్

కౌలు రైతులు మద్దతు ధరకు తమ పత్తిని సీసీఐ కేంద్రాల్లో విక్రయించుకోవడానికి అవకాశం కల్పించినట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సోమవారం తెలిపారు. దళారుల జోక్యం లేకుండా కౌలు రైతులు నేరుగా పత్తి విక్రయం చేయగలరని చెప్పారు. ఇందుకు సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారుల వద్ద తమ వివరాలను నమోదు చేసుకొని, అనంతరం సీసీఐ కేంద్రాల్లో పత్తిని విక్రయించాలని సూచించారు.
News November 11, 2025
9 మంది యువకులపై బైండోవర్ కేసులు

కదిరిలో గంజాయి తాగుతున్న యువకులపై దాడులు చేసి 9 మందిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ నారాయణరెడ్డి తెలిపారు. సోమవారం వీరిపై బైండ్ ఓవర్ కేసులు నమోదుచేసి తల్లిదండ్రుల ముందు కౌన్సిలింగ్ ఇచ్చామన్నారు. మంగళవారం తహశీల్దార్ ముందు ఒక్కొక్కరికి రూ.5 లక్షల ఫైన్ విధించి, బైండ్ ఓవర్ చేయనున్నట్లు వివరించారు. గంజాయిని వాడే 17 ప్రదేశాలను గుర్తించి, ఆ ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు.


