News February 17, 2025
చీరాల: టీడీపీలోకి భారీగా చేరికలు

చీరాల మండలం కావూరివారిపాలెం గ్రామానికి చెందిన 150 కుటుంబాలు టీడీపీలో చేరాయి. చీరాల ఎమ్మెల్యే మాలకొండయ్య పార్టీ కండువాలు వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై ప్రజలు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని పేర్కొన్నారు.
Similar News
News December 30, 2025
రూ.8.41 కోట్లతో ‘మీ ఇంటికి-మీ డాక్టర్’: కలెక్టర్

మారుమూల గిరిజన గ్రామాల్లో వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా రూ.8.41కోట్లతో ‘మీ ఇంటికి-మీ డాక్టర్’ ప్రాజెక్టును అమలు చేయనున్నట్లు కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, ఆర్ఈసీ ఆర్థిక సహకారంతో మూడేళ్లు ఈ ప్రాజెక్టు కొనసాగుతుందని వివరించారు. వచ్చేఏడాది ఫిబ్రవరి మొదటి వారంలో గవర్నర్ చేతుల మీదుగా ఈకార్యక్రమం ప్రారంభం కానుంది. గిరిజనులకు ఈపథకం ఎంతోమేలు చేకూర్చనుందని ఆయన పేర్కొన్నారు.
News December 30, 2025
అలా సందుల్లో దూరడం విజ్ఞత అనిపించుకోదు.. సజ్జనార్ స్వీట్ వార్నింగ్

TG: న్యూ ఇయర్ వేడుకల వేళ యువతకు హైదరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరికలు జారీ చేశారు. చౌరస్తాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ఉంటాయనే భయంతో సందుల్లో దూరి, ప్రమాదకరంగా వాహనాలు నడపడం విజ్ఞత అనిపించుకోదని స్పష్టం చేశారు. మద్యం మత్తులో వాహనం నడపడం మృత్యువును ఆహ్వానించడమేనని, ఒకవేళ యముడు వదిలేసినా చట్టం వదలదన్నారు. ‘మీ ప్రాణం విలువ మాకు తెలుసు. కాబట్టే ఈ హెచ్చరిక’ అని ట్వీట్ చేశారు.
News December 30, 2025
అవార్డ్ అందుకున్న ధర్మారం యువకుడు

ధర్మారం మండలానికి చెందిన కోలిపాక కుమారస్వామి తన జీరో బడ్జెట్‌తో “కళాకారుడు” అనే షార్ట్ ఫిల్మ్‌ని నిర్మించి బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్-2025 అవార్డు అందుకున్నారు. 3 నిమిషాల చిత్రాన్ని 15 రోజుల్లో పూర్తిచేసి 500కుపైగా చిన్న సినిమాలను పోటీలో అధిగమించారు. రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి, TGFDC ఛైర్మన్ దిల్ రాజు, దర్శకుడు హరీశ్ శంకర్ తదితరులు కుమారస్వామిని అభినందించారు.


