News February 17, 2025

 ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు: కలెక్టర్

image

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా సోమవారం జిల్లా, డివిజన్, మండల కార్యాలయాల్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికను జిల్లా అంతటా తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. పీజీఆర్ఎస్ నిర్వహించే తేదీని ప్రకటన ద్వారా తెలియచేస్తామని కలెక్టర్ తెలిపారు. అర్జీదారులు గమనించాలన్నారు.

Similar News

News March 12, 2025

భీమవరం పట్టణంలో బాంబు బెదిరింపు కలకలం

image

భీమవరం పట్టణంలో శ్రీ విష్ణు ఎడ్యుకేషన్ సొసైటీలోని డెంటల్ కళాశాలకు బుధవారం మధ్యాహ్నం మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీనితో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. కాలేజ్ యాజమాన్యం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. వెంటనే బాంబు స్క్వాడ్ రంగంలోకి దిగి తనిఖీలు నిర్వహిస్తుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 12, 2025

హైదరాబాద్‌లో పోడూరు యువకుడు మృతి

image

పోడూరుకి చెందిన రోహిత్ అనే యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన విదితమే. రోహిత్ తల్లి బతుకుదెరువు కోసం దుబాయ్‌ వెళ్లారు. సమాచారం తెలియడంతో ఆమె స్వగ్రామానికి బయలుదేరారు. ఇటీవల భర్త మరణించగా ఆ బాధ నుంచి తెరుకోక ముందే కొడుకు మృతితో ఆమె కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారని బంధువులు తెలిపారు. మృతదేహన్ని స్వగ్రామానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

News March 12, 2025

హైదర్‌బాద్‌లో ఉరిసేకున్న ప.గో జిల్లా యువకుడు

image

ప్రేమ విపలం అవ్వడంతో ప.గో జిల్లాకు చెందిన యువకుడు హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు. పోడూరుకు చెందిన రోహిత్ కూమార్ ఓల్డ్ హఫీజ్ పేటలో స్నేహితులో కలిసి ప్రెవేట్ ఉద్యోగం చేస్తు జీవిస్తున్నాడు. మంగళవారం కలతగా ఉండటంతో ట్యాబెలెట్స్ వేసుకుని పడుకున్నాని చెప్పాడు. స్నేహితులు విధులు ముగించుకుని తిరిగి వచ్చి చూడగా ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

error: Content is protected !!