News March 20, 2024

టీడీపీ జెండాలతోనే బోడె ప్రసాద్ ప్రచారం

image

పెనమలూరు టికెట్ విషయంలో టీడీపీ అధిష్ఠానం లెక్కలు వేసుకునే పనిలో ఉంటే, మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ టీడీపీ అధినేత చంద్రబాబును ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. బుధవారం సాయంత్రం పెనమలూరులో బోడె ప్రసాద్, ఆయన సతీమణి, కుటుంబ సభ్యులంతా టీడీపీ జెండాలతోనే ఎన్నికల ప్రచారం కొనసాగించారు. ఇక చంద్రబాబు నిర్ణయం ఎలా ఉంటుందోనని పార్టీ శ్రేణులు ఎదురు చూస్తున్నారు.

Similar News

News April 6, 2025

కృష్ణా: నదిలో ముగ్గురు గల్లంతు, ఒకరి మృతి 

image

అవనిగడ్డలో పండుగ వేళ విషాదం చోటు చేసుకుంది. ఆదివారం అవనిగడ్డ (మ) మోదుమూడి గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు అవనిగడ్డ శివారు కొత్తపేట వద్ద కృష్ణానదిలో ప్రమాదవశాత్తు గల్లంతయ్యారు. స్థానికులు గమనించి సహాయక చర్యలు చేపట్టే లోపే ముగ్గురిలో వెంకట గోపి కిరణ్ మరణించాడు. మరో ఇద్దరి కోసం డీఎస్పీ విద్యశ్రీ, సీఐ యువ కుమార్, ఎస్ఐ శ్రీనివాస్, సిబ్బంది గాలిస్తున్నారు. 

News April 6, 2025

పెనమలూరు: కలకలం రేపిన మహిళ అనుమానాస్పద మృతి  

image

యనమలకుదురు లంకలలో ఓ మహిళ మృతదేహం కనపడటం కలకలం రేపింది. శనివారం ఉదయం ముళ్లకంపల్లో గులాబీ చీర, జాకెట్‌లో ఆమె శవమై కనిపించింది. కళ్లు, ముక్కు, నోటి నుంచి రక్తస్రావం, మోచేతికి పచ్చబొట్టు ఉండటంతో అనుమానాలు పెరిగాయి. పోలీసులు కేసు నమోదు చేసి డాగ్ స్క్వాడ్‌తో విచారణ ప్రారంభించారు. ఎవరైనా అఘాయిత్యానికి పాల్పడ్డారా అనే అనుమానాలు వస్తున్నాయి. 

News April 6, 2025

కృష్ణా జిల్లాలో తగ్గిన చికెన్ ధరలు.!

image

కృష్ణా జిల్లాలో చికెన్ ధరలు గత వారంతో పోల్చుకుంటే కొంతమేర తగ్గాయి. ఆదివారం జిల్లాలోని గన్నవరం, ఉంగుటూరు, బాపులపాడు మండలాల్లో గత వారంలో కేజీ చికెన్ రూ.260లు ఉండగా, నేడు రూ.230కి తగ్గింది. పెద్దబాయిలేర్ రూ.230, చిన్న బాయిలర్ స్కిన్ లెస్ రూ.230, విత్ స్కిన్ రూ.220గా ఉన్నాయి. ధరలు తగ్గిన నేపథ్యంలో మాంసం దుకాణాల వద్ద కొనుగోలుదారుల సందడి నెలకొంది. మీ ఊరిలో చికెన్ ధరలు ఎలా ఉన్నాయో.. COMMENT చేయండి. 

error: Content is protected !!