News February 17, 2025

అరకు: క్వెస్ట్‌లో విజేతలకు నగదు బహుమతి

image

అల్లూరి జిల్లా అరకు చలి ఉత్సవంలో ది గ్రేట్ అరకు క్వెస్ట్‌లో గెలుపొందిన విజేతలకు పాడేరు కలెక్టరేట్లో కలెక్టర్ దినేష్ కుమార్ నగదు బహుమతి ఆదివారం అందించారు. ప్రథమ స్థానంలో నిలిచిన ధ్రువ అండ్ టీమ్‌కు రూ. 50,000, ద్వితీయ స్థానంలో ఉన్న మంగతల్లి టీమ్‌కు రూ. 30,000, తృతియ బహుమతి రూ. 20,000లను భాస్కర్ రెడ్డి టీమ్‌కి అందజేశారు. మ్యూజియం క్యూరేటర్ వి మురళి, ఆయా బృంద సభ్యులు పాల్గొన్నారు.

Similar News

News July 6, 2025

జగిత్యాల: మిస్టరీగా 5 ఏళ్ల చిన్నారి మృతి!

image

కోరుట్లలోని <<16959055>>5 ఏళ్ల చిన్నారి మృతి <<>>కేసు మిస్టరీగా మారింది. అభం శుభం తెలియని బాలిక హితీక్ష ప్రమాదవశాత్తు మరణించిందా లేదా హత్య చేశారా అనే కోణాల్లో దర్యాప్తు జరుగుతోంది. అయితే నిన్న సాయంత్రం పెద్దపులుల విన్యాసాలు చూసేందుకు మిత్రులతో కలిసి వెళ్లిన చిన్నారి భయంతో బాత్రూంలో దాక్కోగా కాలుజారి అక్కడే ఉన్న నల్లాపై పడి చనిపోయిందనే అనుమానమూ వ్యక్తమవుతోంది. బాలిక తండ్రి రాము ఉపాధి నిమిత్తం గల్ఫ్‌లో ఉంటున్నారు.

News July 6, 2025

వత్సవాయిలో ప్రమాదం.. ఒకరి మృతి

image

వత్సవాయి నుంచి వైరా వెళ్లే రహదారిలో ఆదివారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. ట్రాక్టర్‌ను లారీ ఢీకొనడంతో తాళ్లూరు వెంకటేశ్ అక్కడికక్కడే మృతి చెందగా, పెనుగొండ బాల, రాయల రాంబాబు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News July 6, 2025

4 బంతుల్లో 3 వికెట్లు

image

మేజర్ లీగ్‌ క్రికెట్‌లో ఆడమ్ మిల్నే అదరగొట్టారు. సియాటెల్ ఆర్కాస్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్లు తీసి టెక్సాస్ విజయంలో కీలకపాత్ర పోషించారు. 19వ ఓవర్‌లో తొలి 2 బంతులకు 2 వికెట్లు పడగొట్టిన అతడు 4వ బంతికి మరో వికెట్ తీసి సియాటెల్‌ను ఆలౌట్ చేశారు. దీంతో మొత్తం ఆ ఓవర్‌లో 4 బంతుల్లోనే 3 వికెట్లు పడగొట్టారు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన టెక్సాస్ 188 రన్స్ చేయగా ఛేజింగ్‌లో సియాటెల్ 137 పరుగులకే కుప్పకూలింది.