News March 20, 2024
నీట్ పీజీ ఎగ్జామ్ ప్రీపోన్డ్

NEET PG-2024 పరీక్ష ప్రీపోన్డ్ అయింది. షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్ష జులై 7న జరగాల్సి ఉంది. అయితే జూన్ 23న నిర్వహించాలని నేషనల్ మెడికల్ కమిషన్ నిర్ణయించింది. జులై 15న ఫలితాలు వెలువడనున్నాయి.
Similar News
News September 9, 2025
లోకో పైలట్ ఉద్యోగాల్లో రిజర్వేషన్‌పై నెట్టింట చర్చ

లక్షలాది ప్రయాణికుల భద్రతను ప్రత్యక్షంగా ప్రభావితం చేసే లోకో పైలట్ నియామకంలో రిజర్వేషన్లు ఉండొద్దని ఓ ప్రొఫెసర్ చేసిన ట్వీట్ వైరలవుతోంది. సిగ్నల్స్, రూట్స్, ఇంజిన్ నియంత్రణకు బాధ్యత వహించే అసిస్టెంట్ లోకో పైలట్ జాబ్‌ను తక్కువ మార్కులొచ్చిన వారికి ఎలా ఇస్తారని మండిపడ్డారు. నోటిఫికేషన్‌లో URకు 66.66 మార్కులు కట్ఆఫ్‌గా ఉంటే BC & EWSలకు 40, SCలకు 34, STలకు 25 మార్కులు ఉన్నాయి. దీనిపై మీ కామెంట్?
News September 9, 2025
వివేకా హత్య కేసు విచారణ మళ్లీ వాయిదా

AP: వివేకా హత్య కేసు విచారణను సుప్రీంకోర్టు మరోసారి వాయిదా వేసింది. తదుపరి దర్యాప్తు అవసరమా? లేదా? అన్నదానిపై అఫిడవిట్ దాఖలు చేయాలని సీబీఐని గతంలో ధర్మాసనం ఆదేశించింది. ఇవాళ సీబీఐ తరఫున కోర్టుకు హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు అఫిడవిట్ దాఖలుకు మరింత సమయం కావాలని కోరారు. దీంతో న్యాయస్థానం విచారణను ఈనెల 16కు వాయిదా వేసింది.
News September 9, 2025
ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్‌లో అప్రెంటీస్‌లు

DRDOకు చెందిన ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్-చాందీపూర్‌లో ఇంజినీరింగ్ డిగ్రీ, డిప్లొమా అప్రెంటీస్ పోస్టులకు అక్టోబర్ 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేషన్ అప్రెంటీస్‌లు పోస్టులు 32, డిప్లొమా అప్రెంటీస్‌లు 22 ఉన్నాయి. దరఖాస్తులను స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పంపాలి. వెబ్‌సైట్: https://drdo.gov.in/