News February 17, 2025

కడప కలెక్టరేట్ ప్రజా ఫిర్యాదు పరిష్కార వేదిక

image

ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు కడప కలెక్టరేట్లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కారం వేడుక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ శ్రీధర్ పేర్కొన్నారు. అందులో భాగంగా ఉదయం 10 గంటలకు కలెక్టర్ కార్యక్రమం ఉంటుందన్నారు. ఆ తర్వాత సభా భవనంలో ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరిస్తారని పేర్కొన్నారు. కలెక్టరేట్‌తో పాటు అన్ని మండలాలు మున్సిపల్ కార్యాలయంలో కూడా ప్రజల అర్జీలను స్వీకరిస్తారని ఆయన పేర్కొన్నారు.

Similar News

News November 6, 2025

కడప: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

image

కడప జిల్లా కొండాపురం మండలంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు చనిపోయారు. తాళ్ల ప్రొద్దుటూరుకు చెందిన బోరు నారాయణరెడ్డి గ్రామం వద్ద బైకుపై రోడ్డు దాటుతుండగా కడప వైపు నుంచి తాడిపత్రి వైపు వెళ్తున్న కారు ఢీకొట్టింది. ఈప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నారాయణరెడ్డి అక్కడికక్కడే మృతిచెందాడు. అతి వేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు.

News November 6, 2025

జమ్మలమడుగు: తండ్రి, కుమార్తెకు జైలుశిక్ష

image

జమ్మలమడుగులోని నాగులకట్ట వీధికి చెందిన గంజి మాధవి(32) బీసీ కాలనీకి చెందిన మునగాల రవి(35) దగ్గర రూ.5లక్షలు అప్పు తీసుకుంది. డబ్బులు తిరిగి ఇవ్వాలని రవి ఒత్తిడి చేయడంతో అతడిపై ఆమె కక్ష పెంచుకుంది. 2017 జనవరి 19న నాగులకట్ట వీధిలో తన తండ్రి సూర్యనారాయణ రెడ్డి(65)తో కలిసి రవిని ఇనుప రాడ్డుతో కొట్టి హత్య చేసింది. నేరం నిరూపణ కావడంతో మాధవి, సూర్యనారాయణకు కోర్టు తాజాగా జీవిత ఖైదు విధించింది.

News November 6, 2025

22 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు: జేసీ

image

జిల్లాలో వరి రైతులకు కనీస మద్దతు ధర అందించేందుకు 22 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జాయింట్ కలెక్టర్ అదితిసింగ్ తెలిపారు. సాధారణ రకం వరికి క్వింటాకు రూ. 2,369, ఏ-గ్రేడ్ రకానికి రూ. 2,389 ప్రభుత్వం చెల్లిస్తుందని స్పష్టం చేశారు. ఈ-క్రాప్, ఈ-కేవైసీతో పాటు తమ పేర్లను నమోదు చేసుకున్న రైతులు మాత్రమే కొనుగోలుకు అర్హులని ఆమె తెలిపారు.