News February 17, 2025
జనగామ: ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు 17 మంది గైర్హాజరు

జనగామ జిల్లాలో ఆదివారం నిర్వహించిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ప్రాక్టికల్ పరీక్షలకు 17 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని డీఐఈఓ జితేందర్ రెడ్డి తెలియజేశారు. మొదటి సెషన్‌లో 161 మంది విద్యార్థులకు గాను 153 విద్యార్థులు హాజరయ్యారు. రెండో సెషన్‌లో 195 మంది విద్యార్థులకు గాను 186 విద్యార్థులు హాజరైనట్లు తెలియజేశారు.
Similar News
News November 11, 2025
పల్నాడు వెలలేని మాగాణి: పులుపుల వెంకట శివయ్య

వెనుక తరముల వారి వీరచరితల సిరులు, నార్వోసి త్యాగంబు నీర్వెట్టి పెంచరా! విరిసి సుఖములు పండురా, పల్నాడు వెలలేని మాగాణిరా! అంటూ పల్నాడు గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన కవి పులుపుల వెంకట శివయ్య. ఆయన వినుకొండకు 1952, 62లో రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. వామపక్ష నేతగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎన్నో సమరశీల పోరాటాలు నిర్వహించారు. వినుకొండ నడిబొడ్డున ఆయన స్మారకంగా శివయ్య స్తూపం నేటికీ ఉంది.
News November 11, 2025
గద్వాల్ రైల్వే స్టేషన్‌లో వందే భారత్ ఆపాలి..!

గద్వాల్ రైల్వే స్టేషన్‌లో కాచిగూడ-యశ్వంతపూర్ వందేభారత్ రైలును ఆపాలని ప్రయాణికులు కోరుతున్నారు. అత్యవసర సమయంలో వందేభారత్ వంటి అధునాతన రైలు గద్వాల్‌లో ఆగితే అభివృద్ధికి ఊతమిస్తుందని అభిప్రాయపడుతున్నారు. గద్వాల్ నుంచి అనంతపురం, బెంగుళూరు వంటి ప్రాంతాలకు వేగంగా ప్రయాణించడంతో పాటు సమయం కూడా ఆదా అవుతుంది. రైల్వే అధికారులు స్పందించి హాల్ట్ ఇవ్వాలని కోరుతున్నారు. దీనిపై మీ కామెంట్..!
News November 11, 2025
ఏపీలో నేడు..

▶ గుంటూరులో జరుగుతున్న వాటర్ షెడ్ మహోత్సవ్‌లో పాల్గొననున్న కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. అనంతరం CM చంద్రబాబుతో భేటీ
▶ అమరావతిలో దసపల్లా 4 స్టార్ హోటల్ నిర్మాణానికి భూమిపూజ
▶ శ్రీకాకుళంలో ఇవాళ్టి నుంచి ప్రారంభంకానున్న సిక్కోలు పుస్తక మహోత్సవం, 10 రోజులు కొనసాగింపు


