News February 17, 2025

ఈ నిమ్మకాయ ధర రూ.5.09లక్షలు

image

HYDలోని బాలాపూర్ గణేశుడి లడ్డూకు ఎంత డిమాండ్ ఉంటుందో TNలోని పళని మురుగన్ నిమ్మకాయలకు అంతే పోటీ ఉంటుంది. పళనిలో ఏటా 3 రోజులు తైపూస ఉత్సవాలు జరిపి మురుగన్ పాదాల వద్ద ఉంచిన నిమ్మకాయలను వేలం వేస్తారు. తాజాగా జరిగిన వేలంలో ఒక్కో నిమ్మకాయ రూ.16వేల- రూ.40వేల వరకు పలికింది. తైపూసం రోజు నాటి నిమ్మకాయను ఓ భక్తుడు రూ.5.09లక్షలకు సొంతం చేసుకున్నారు. వేలంలో కేవలం వల్లనాట్టు చెట్టియార్లు మాత్రమే పాల్గొంటారు.

Similar News

News April 18, 2026

సోమవారం రెండో విడత శాంతి చర్చలు!

image

అమెరికా-ఇరాన్ రెండో విడత శాంతి చర్చలకు సిద్ధమయ్యాయి. అందుకు మరోసారి పాకిస్థాన్‌ను వేదికగా ఎంచుకున్నాయి. ఇస్లామాబాద్‌లో వచ్చే సోమవారం చర్చలు జరపనున్నట్లు సమాచారం. రేపు ఇరాన్ ప్రతినిధులు పాక్ చేరుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తొలి విడత చర్చలు విఫలమైన విషయం తెలిసిందే.

News April 18, 2026

పెరిగిన బంగారం ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం, వెండి ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.810 పెరిగి రూ.1,55,780కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.750 పెరిగి రూ.1,42,800గా ఉంది. ఇక కేజీ సిల్వర్ రేటు రూ.5000 ఎగసి రూ.2,80,000కి చేరింది.

News April 18, 2026

IPLలో అన్‌సక్సెస్‌ఫుల్ కెప్టెన్ ఇతడే..

image

IPL చరిత్రలో 25+ మ్యాచులకు నాయకత్వం వహించి అతి తక్కువ విన్నింగ్ పర్సంటేజ్(31.8%) కలిగిన కెప్టెన్‌గా అజింక్య రహానే నిలిచారు. ఆయన 44 మ్యాచులకు కెప్టెన్సీ చేయగా 14సార్లు మాత్రమే గెలిచారు. ఆయన తర్వాతి స్థానాల్లో జయవర్ధనే(33.3%), సంగక్కర (36.2%), ధవన్ (37%), గంగూలీ(40.5%) ఉన్నారు. కాగా ప్రస్తుత సీజన్‌లో రహానే కెప్టెన్సీలో KKR ఇప్పటివరకు 6 మ్యాచులు ఆడగా ఐదింట్లో ఓడింది. ఒక మ్యాచ్ రద్దయింది.