News February 17, 2025
‘ములుగు బస్టాండ్‌లోని పోచమ్మ గుడిని తొలగించొద్దు’

ములుగు జిల్లా కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో గల పోచమ్మ గుడిని తొలగించవద్దని ప్రజలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. బస్టాండ్ వెడల్పు పేరుతో పోచమ్మ గుడిని తొలగించాలనే నిర్ణయాన్ని అధికారులు వెనక్కి తీసుకోవాలని కోరుతున్నారు. గ్రామ దేవతలు ఒకటైన పోచమ్మ దేవత ఆశీస్సుల వల్ల ములుగు దినదినం అభివృద్ధి చెందుతోందని, ప్రజలు ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో ఉంటున్నారని, అలాంటి గుడిని తొలగించడం సరికాదన్నారు.
Similar News
News November 6, 2025
సిరిసిల్ల: ‘రవాణా చేసినా, అమ్మినా కఠిన చర్యలు తప్పవు’

గంజాయి రవాణా చేసినా, అమ్మినా, సేవించినా కఠిన చర్యలు తప్పవని టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ నటేశ్ అన్నారు. సిరిసిల్ల పరిధిలోని పాన్ షాప్, లాడ్జిలో గురువారం పోలీస్ జాగిలాలతో తనిఖీ నిర్వహించారు. ఇన్‌స్పెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో గంజాయి వంటి మత్తు పదార్థాల నిర్మూలనేని లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పనిచేస్తుందని పేర్కొన్నారు. జిల్లాలో గంజాయి అమ్మినా, తాగినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
News November 6, 2025
రాహుల్ ఆరోపించిన చోట కాంగ్రెస్‌కే అధిక ఓట్లు

హరియాణాలో భారీగా ఓటు చోరీ జరిగిందని నిన్న LoP రాహుల్ గాంధీ ECపై ఆరోపణలు గుప్పించడం తెలిసిందే. ములానా సెగ్మెంటు ఢకోలా గ్రామంలో ఒకే ఫొటో (బ్రెజిలియన్ మోడల్)తో 223 ఓట్లున్నట్లు చూపారు. అయితే 2024 పోలింగ్‌లో అక్కడ CONGకే ఎక్కువ ఓట్లు పడ్డాయి. అసెంబ్లీ ఎన్నికల్లో BJPకి 275, CONGకు 602 ఓట్లు రాగా లోక్‌సభలో BJP కన్నా CONGకు 392 ఓట్లు ఎక్కువొచ్చాయి. 2019తో పోలిస్తే 2024లో కాంగ్రెస్‌కే అధిక ఓట్లు పడ్డాయి.
News November 6, 2025
సిరిసిల్ల: ‘పనులు వేగవంతం చేయాలి’

పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్ గరీమ అగ్రవాల్ అన్నారు. ఎంపీ లార్డ్స్‌తోపాటు వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా మంజూరైన నిధులతో మొదలుపెట్టిన పనుల ప్రగతిపై జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో ఆమె సమీక్ష నిర్వహించారు. గ్రామపంచాయతీ, అంగన్‌వాడి భవన నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించి త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.


