News February 17, 2025

కామారెడ్డి: ఆర్టీసీ ఏసీ బస్సులో 10% రాయితీ

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి బెంగళూరు వరకు వెళ్లే ఆర్టీసీ ఏసీ బస్సులో 10 శాతం రాయితీ కల్పించినట్లు కామారెడ్డి ఆర్టీసీ డిపో మేనేజర్ ఇందిరా తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె చెప్పారు. దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఆర్టీసీ సంస్థ ప్రత్యేక రాయితీలు కల్పిస్తుందని వివరించారు. ప్రత్యేక బస్సుల్లో ప్రయాణికులకు అనుకూలమైన వసతులు కల్పించినట్లు తెలిపారు.

Similar News

News January 5, 2026

తిరుపతి: 5 ఏళ్ల జైలు శిక్ష.. ఒక్కొక్కరికి రూ.3 లక్షల ఫైన్

image

2018లో ఎర్రవారి పాలెంలో నమోదైన కేసులో నలుగురు స్మగ్లర్లకు 5 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, ఒక్కొక్కరికి రూ.3లక్షల జరిమానా విధిస్తూ తిరుపతి కోర్టు తీర్పునిచ్చింది. జిల్లా SP సుబ్బరాయుడు ‘గుడ్ ట్రయల్ మానిటరింగ్’ విధానం వల్ల సరైన సాక్ష్యాధారాలతో నిందితులకు శిక్ష పడింది. అడవుల సంపదను దోచుకునే వారిపై రాజీలేని పోరాటం చేస్తామని, అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.

News January 5, 2026

పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంలో అలసత్వం వీడాలి: ఇన్‌ఛార్జ్ కలెక్టర్

image

ప్రజా ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలని ఇన్‌ఛార్జ్ కలెక్టర్ శివ్ నారాయణన్ శర్మ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి 629 అర్జీలు స్వీకరించారు. ప్రతి అర్జీకి ఎండార్స్మెంట్ ఇవ్వాలని, బియాండ్ ఎస్ఎల్ఏ లేకుండా సమస్యలు పరిష్కరించాలన్నారు. మున్సిపల్, రెవెన్యూ, పోలీస్ శాఖలతో పాటు సీఎంఓ, ఎమ్మెల్యే, ఎంపీ పెండింగ్ ఫిర్యాదులను పూర్తి చేయాలన్నారు.

News January 5, 2026

NRPT: విధుల నుంచి ఉపాధ్యాయులను మినహాయించాలి

image

రాబోయే మున్సిపల్ ఎన్నికల విధుల నుంచి ఆర్ఓ, ఏఆర్ఓలుగా పదో తరగతి బోధించే ఉపాధ్యాయులను మినహాయించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా శాఖ పక్షాన నారాయణపేట కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ శ్రీనుకు సోమవారం నేతలు వినతిపత్రం అందించారు. వారి స్థానంలో ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులను, యూపీఎస్ పాఠశాలలో పని చేస్తున్న స్కూల్ అసిస్టెంట్‌లను వినియోగించుకోవాలని జిల్లా అధ్యక్షుడు నరసింహ కోరారు.