News February 17, 2025
జగిత్యాల: ప్రమాదవశాత్తు నిప్పంటుకొని వృద్ధురాలు మృతి

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం తక్కలపల్లి గ్రామానికి చెందిన గడ్డమీద గంగు(72) అనే వృద్ధురాలు ప్రమాదవశాత్తు నిప్పు అంటుకోవడంతో తీవ్ర గాయాలయ్య మృతి చెందినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. గంగు శనివారం రాత్రి తన ఇంటిలో టీ తయారు చేస్తుండగా.. ప్రమాదవశాత్తు చీరకు నిప్పంటుకుంది. మంటలు చెలరేగడంతో తీవ్ర గాయాలయ్యాయి. జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సలు పొందుతూ మృతి చెందినట్లు ఎస్ఐ నవీన్ చెప్పారు.
Similar News
News September 13, 2025
జూబ్లీహిల్స్ అభివృద్ధిపై కాంగ్రెస్ ఫోకస్..!

జూబ్లీహిల్స్ అభివృద్ధిపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. రాష్ట్ర మంత్రులు నిరంతరం ఆ నియోజకవర్గంలో పర్యటిస్తూ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తూ బిజీగా ఉంటున్నారు. ఈరోజు ఎర్రగడ్డ డివిజన్‌లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ రూ.2.94 కోట్లతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, కాంగ్రెస్, BJP, MIM నాయకులు ఉన్నారు.
News September 13, 2025
మందు బాబులకు భారీగా జరిమానాలు: VZM SP

మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై భారీగా జరిమానాలను కోర్టు విధించిందని ఎస్పీ వకుల్ జిందాల్ శనివారం తెలిపారు. మొత్తం 85 మందిని కోర్టులో ప్రవేశపెట్టగా ఒక్కొక్కరికి రూ.10వేలు చొప్పున రూ.8.50 లక్షల జరిమానాను విధిస్తూ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ తేజ చక్రవర్తి తీర్పు చెప్పారన్నారు. మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్ల ప్రమాదాల బారిన పడడమే కాకుండా ఇతరులకు కూడా నష్టాన్ని కలిగిస్తున్నారన్నారు.
News September 13, 2025
తిరుపతి SPగా సుబ్బరాయుడు ఘనతలు ఇవే.!

తిరుపతి SPగా సుబ్బరాయడుకు రెండోసారి అవకాశం దక్కింది. మెదటి టర్మ్‌లో ఆయన కీలక నిర్ణయాలు తీసుకున్నారు. యాత్రికుల క్షేమం కోసం నైట్ బీట్లను ముమ్మరం చేయడం, అప్పట్లో సంచలనంగా మారిన ఎర్రవారిపాళ్యం ఫొక్సో కేసులో 24 గంటల్లో నిందితుడిని అరెస్టు చేశారు. తిరుపతిలో మహిళా రక్షక్ టీములను ఏర్పాటు చేసిన ఘనత ఈయనదే. నగరంలో గంజాయిపై ఉక్కుపాదం మోపారు. అప్పట్లో 15 మంది పోలీసులపై సైతం ఆయన చర్యలు తీసుకున్నారు.