News March 20, 2024
కేంద్రమంత్రిపై ఈసీ ఆగ్రహం
కేంద్ర మంత్రి శోభ వ్యాఖ్యలపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె వ్యాఖ్యలను పరిశీలించి చర్యలు తీసుకోవాల్సిందిగా కర్ణాటక సీఈవోను ఆదేశించింది. కాగా రామేశ్వరం పేలుళ్ల వెనుక తమిళుల పాత్ర ఉందని శోభ చేసిన వ్యాఖ్యలపై డీఎంకే పార్టీ ఈసీకి ఫిర్యాదు చేసింది. మరోవైపు తన వ్యాఖ్యలపై శోభ క్షమాపణలు చెప్పింది.
Similar News
News November 25, 2024
IPL: మ్యాజిక్ మ్యాన్.. భలే ఎత్తుగడలు!
ఇతర ఫ్రాంఛైజీల పర్స్ మనీని ఖాళీ చేయడంలో కిరణ్ కుమార్ గ్రంధి దిట్ట. GMR గ్రూప్స్ ఛైర్మన్ గ్రంధి మల్లికార్జున రావు కుమారుడైన కిరణ్ ప్రస్తుతం DC కో-ఓనర్‌గా ఉన్నారు. నిన్న పంత్‌ను లక్నో రూ.21 కోట్లకు కొనేందుకు సిద్ధమవ్వగా కిరణ్ కుమార్ RTMతో భయపెట్టి ఆ రేటును పెంచేలా చేశారు. ఫలితంగా పంత్ కోసం లక్నో రూ.27 కోట్లు పెట్టాల్సి వచ్చింది. అలాగే స్టార్ బౌలర్ స్టార్క్‌ను రూ.11.75 కోట్లకే దక్కించుకున్నారు.
News November 25, 2024
ప్రజాపాలన విజయోత్సవాలు.. ప్రాజెక్టులు ఇవే
TG: డిసెంబర్ 1 నుంచి 9 వరకు ప్రభుత్వం ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించనుంది.
*26 నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు
*16 నర్సింగ్, 28 పారా-మెడికల్ కాలేజీల నిర్మాణం
*యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో క్లాసుల ప్రారంభం
*స్పోర్ట్స్ యూనివర్సిటీకి శంకుస్థాపన
*దామరచర్లలోని 800 MW థర్మల్ పవర్ ప్లాంట్ జాతికి అంకితం
*ఏఐ సిటీకి శంకుస్థాపన, కంపెనీలతో ఒప్పందాలు
News November 25, 2024
అదే జరిగితే నేడు రూ.10లక్షల కోట్ల లాభం!
మహారాష్ట్రలో మహాయుతి విజయంతో నిఫ్టీ 400, సెన్సెక్స్ 2000 పాయింట్లు పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇదే జరిగితే నేడు ఇన్వెస్టర్లు రూ.10L కోట్లమేర లాభం పొందుతారు. కేంద్ర పాలసీలకు అనుగుణంగా ఉండే కంపెనీల షేర్లలో వారు పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. ఇక మహారాష్ట్రలో BJP అనుకూల ప్రమోటర్లున్న కంపెనీలపై ఆసక్తి పెరిగింది. APలో NDA గెలిచినప్పుడు హెరిటేజ్ ఫుడ్స్ షేర్లు వరుసగా అప్పర్ సర్క్యూట్ తాకడం తెలిసిందే.