News February 17, 2025

ములుగు: ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థిని గెలిపించాలి: చిరంజీవి

image

ఉమ్మడి వరంగల్- ఖమ్మం -నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థి పూల రవీందర్‌ను గెలిపించాలని రాష్ట్ర బీసీ మేధావుల ఫోరం అధ్యక్షుడు, మాజీ ఐఏఎస్ చిరంజీవి అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో 90% ఓటర్లు బహుజనులు ఉన్నారని, బహుజనుల ఓటు బహుజన అభ్యర్థులకే వేయాలని అన్నారు. పూల రవీందర్ గెలుపు కోరుతూ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చిరంజీవి ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Similar News

News April 20, 2026

విజయ్ విడాకుల కేసు.. నేడే విచారణ

image

TVK అధినేత విజయ్-సంగీత విడాకుల కేసు నేడు చెంగల్పట్టు కోర్టులో విచారణకు రానుంది. విచారణకు హాజరుకావాలని ఇప్పటికే విజయ్‌కు కోర్టు నోటీసులిచ్చింది. కాగా విజయ్, సంగీత పరస్పర ఆమోదంతో విడిపోయేందుకు శనివారం లాయర్లతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. సెటిల్‌మెంట్ కింద రూ.250 కోట్లు ఇవ్వాలని సంగీత కోరగా రూ.35 కోట్లు ఇచ్చేందుకు విజయ్ ఓకే చెప్పినట్లు సమాచారం.

News April 20, 2026

ఓపెన్ స్కూల్ పరీక్షలు…కంట్రోల్ రూమ్ ఏర్పాటు

image

ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు నేడు మొదలుకానున్నాయి. పరీక్షా కేంద్రాల్లో అవాంఛనీయ ఘటనలు జరిగినా, కేంద్రాలకు సంబంధించి సమాచారం కావాలన్నా తెలుసుకునేందుకు కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. ఈమేరకు ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ కూరపాటి మంగపతిరావు 9440728543 నంబర్లకు, ఖమ్మం జిల్లాకు సంబంధించి 8008403522, 8142406769 నంబర్లకు సంప్రదించాలని డీఈఓ చైతన్యజైనీ సూచించారు.

News April 20, 2026

VJA: సీఎం రాక నేపథ్యంలో.. పోలీసుల అలర్ట్

image

సీఎం చంద్రబాబు సోమవారం అన్న క్యాంటీన్‌ను సందర్శించనున్న నేపథ్యంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆదివారం రాత్రి నుంచే బాంబు, డాగ్ స్క్వాడ్ బృందాలు క్యాంటీన్ పరిసరాల్లో విస్తృత తనిఖీలు చేపట్టాయి. రహదారులు, పార్కింగ్ స్థలాలు, సమీప భవనాలను క్షుణ్ణంగా సోదా చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.