News February 17, 2025
మెదక్: కలుసుకున్న 1972 ఇంటర్ మొదటి బ్యాచ్

మెదక్ పట్టణంలో ఇంటర్మీడియట్ మొదటి బ్యాచ్(1972) చదువుకున్న వారంతా ఆదివారం కలుసుకున్నారు. ఇందులో కొందరు చాలా ఉన్నత స్థానంలో ఉన్నారు. సరోజిని దేవి విద్యాసంస్థల ఛైర్మన్ ఆర్. జనార్ధన్ రెడ్డి, రిటైర్డ్ TSPCDL డైరెక్టర్ తౌట శ్రీనివాస్, వివి సిల్క్స్ వనపర్తి వెంకటేశం, అల్లెంకి సుదర్శనం, వెంకటేశం, మేడిశెట్టి కుమార్, STO జగన్నాథం, డా. రామరాజు, క్రిష్ణయ్య తదితరులున్నారు. వారంత ఆప్యాయంగా మాట్లాడుకున్నారు.
Similar News
News January 20, 2026
గణతంత్ర దినోత్సవ వేడుకలను పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్

గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్‌లో అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. మెదక్ పోలీస్ పరేడ్ మైదానంలో జరిగే రిపబ్లిక్ డే వేడుక సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి ఆయా శాఖల వారీగా అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎలాంటి లోటులేకుండా చూడాలన్నారు.
News January 20, 2026
తూప్రాన్: యువతి ఆత్మహత్య

తూప్రాన్ మండలం నర్సంపల్లికి చెందిన గిరిజన యువతి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నర్సంపల్లి గ్రామానికి చెందిన ధరావత్ మమత(18) ఈనెల 16న విష పదార్థం తిని ఆత్మహత్యకు పాల్పడింది. చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా లక్ష్మక్కపల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందినట్లు చెప్పారు. మమతకు ఇటీవల వివాహం కూడా నిశ్చయమైనట్లు సమాచారం.
News January 20, 2026
కౌడిపల్లి: బాత్రూంలో పడి యువకుడి మృతి

కౌడిపల్లి మండలం వెల్మకన్నకు చెందిన యువకుడు బాత్రూంలో పడి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు… దేశాయిపేట గణేశ్ శర్మ(28) హైదరాబాద్‌లో ఫిజియోథెరపిస్ట్‌గా పని చేస్తున్నాడు. సోమవారం బాత్రూంలో పడిపోయి ఉండటంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు ధ్రువీకరించారు. ఏడాది క్రితమే గణేశ్ శర్మ వివాహం జరిగింది.


