News February 17, 2025
మానవత్వం చాటుకున్న హరీశ్ రావు

అనారోగ్యంతో బాధపడుతున్న మహిళను ఎమ్మెల్యే హరీశ్ రావు ఆదుకున్నారు. ఆధార్ కార్డు లేదని ప్రమీల అనే మహిళను వైద్యం చేయకుండా ఉస్మానియా ఆసుపత్రి సిబ్బంది బయటకు పంపించారు. సమస్య తన దృష్టికి రావడంతో స్పందించి, మానవత్వం చాటుకుని ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండ్‌తో మాట్లాడి తక్షణం ఆసుపత్రిలో చేర్చుకోవాలని, చికిత్స అందించాలని హరీశ్ రావు ఆదేశించారు.
Similar News
News October 19, 2025
పాతమాగులూరు: హత్య కేసులో బెయిల్ మంజూరు

సంతమాగులూరు మండలం పాత మాగులూరులో బెంగళూరుకు చెందిన వీరస్వామి రెడ్డి, వీరస్వామి రెడ్డి జులై 23న నరసరావుపేటలో కిడ్నాప్‌నకు గురయ్యారు. అనంతరం అదేరోజు మండలంలోని పాత మాగులూరు వద్ద హత్యకు గురయ్యారు. అదే నెల 27న బాదం మాధవరెడ్డి సహా 12 మంది ప్రమేయం ఉన్నట్లుగా పోలీసులు అరెస్ట్ చేశారు. సంబంధించి శనివారం మాధవరెడ్డితో సహా 11 మందికి బెయిల్ మంజూరైంది.
News October 19, 2025
వనపర్తి జిల్లా నుంచి 73 లైసెన్స్ సర్వేయర్లు ఎంపిక

వనపర్తి జిల్లాలో లైసెన్స్ సర్వేయర్లుగా ఎంపికై శిక్షణ పూర్తి చేసుకున్న సర్వేయర్లకు లైసెన్స్ పంపిణీని కార్యక్రమంలో భాగంగా వనపర్తి జిల్లా నుంచి 73 మంది లైసెన్స్ సర్వేయర్లు హైదరాబాద్ బయలు దేరారు. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా HYD శిల్పకళా మాదాపూర్‌లో సర్వేయర్లకు లైన్స్‌ల పంపిణీ చేయనున్నారు. రాష్ట్ర మొత్తం 3,465 మంది లైసెన్స్ సర్వేయర్లకు లైసెన్సులు పంపిణీ చేయనున్నారు.
News October 19, 2025
విజయవాడలో నేడు సీఎం చంద్రబాబు పర్యటన

విజయవాడలో సీఎం చంద్రబాబు నేడు పర్యటించనున్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని పున్నమి ఘాట్ వద్ద ఆదివారం సాయంత్రం 6 గంటలకు జరిగే దీపావళి వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారని వెస్ట్ ఎమ్మెల్యే కార్యాలయం తెలియజేసింది. కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా హాజరుకానున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు పున్నమి ఘాట్ పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.